https://oktelugu.com/

Star heroine Sushmita Sen : 95 శాతం గుండె బ్లాక్.. గుండెపోటుతో చావు అంచుల వరకు వెళ్లిన స్టార్ హీరోయిన్

Star heroine Sushmita Sen : సినీ ఇండస్ట్రీని గుండెపోట్లు కుదిపేస్తున్నాయి. ఇటీవల చాలా మంది నటులు గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తుండడం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల కిందట తెలుగు నటుడు తారకరత్నకు గుండె రక్తనాళాలు 90 శాతం బ్లాక్ అయ్యాయని వైద్యులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులు చికిత్స పొందిన ఆయన ఆ తరువాత ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తాజాగా మరో నటికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రముఖ బాలీవుడ్ నటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 5, 2023 / 02:13 PM IST
    Follow us on

    Sushmita Sen

    Star heroine Sushmita Sen : సినీ ఇండస్ట్రీని గుండెపోట్లు కుదిపేస్తున్నాయి. ఇటీవల చాలా మంది నటులు గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తుండడం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల కిందట తెలుగు నటుడు తారకరత్నకు గుండె రక్తనాళాలు 90 శాతం బ్లాక్ అయ్యాయని వైద్యులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులు చికిత్స పొందిన ఆయన ఆ తరువాత ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తాజాగా మరో నటికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆమె గుండెకు రక్తాన్ని పంపించే నాళాలు 95 శాతం బ్లాక్ అయ్యాయి. దాదాపు చావు అంచుల వరకు వెళ్లిన ఆమె దేవుడి దయ వల్ల బతికినట్లు తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

    ప్రపంచ విశ్వసుందరిగా కిరీటం పొందిన సుస్మితా సేస్.. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. ‘వాస్తు శాస్త్ర’, ‘పైసా వసూల్’, ‘ నో ప్రాబ్లమ్’, ‘నాయక్’ వంటి సినిమాలు ఆమెకు గుర్తింపు నిచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ తరువాత ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్లాట్ ఫాం మీద మెరిశారు. ఇటీవల సుస్మితాసేన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సంబంధీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటు అని చెప్పినట్లు సుస్మితా సేన్ తెలిపింది. ఈమేరకు తనకు జరిగిన అవస్థ గురించి ఓ వీడియోలు వివరించారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యాను. గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళం 95 శాతం బ్లాక్ అయింది. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నా. ఇక్కడి వైద్యలు ఎంతగానో శ్రమించి నన్ను కాపాడారు. అయితే చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎవరికీ చెప్పొద్దని అనుకున్నా.. ప్రస్తుతం కోలుకున్నాకే అందరికీ చెప్పాలనీ ఈ వీడియో పోస్టు చేశా. దీంతో అందరూ నాకు గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నా పై ప్రేమ చూపిస్తున్న వారికి థ్యాంక్స్ ’ అని సుస్మితా సేన్ అన్నారు.

    ఇంకా తనకు వైరల్ ఇన్ ఫెక్షన్ కారణంగా గొంతు సరిగా రావట్లేదని సవరించుకుంటూ మాట్లాడారు. ప్రపంచ నలుమూలల నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకోసం దేవుడిని ప్రార్థించినవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. ప్రస్తుతం అందరికీ థ్యాంక్ష్ చెప్పేందుకు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానని సుస్మితా సేన్ చెప్పడంతో ఆమె అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.