https://oktelugu.com/

Manisha Koirala : రజినీకాంత్ వల్లే నా కెరీర్ సర్వనాశనం అయ్యింది అంటూ స్టార్ హీరోయిన్ ఆరోపణ!

Manisha Koirala : ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చెయ్యడానికి ఎవరికీ మాత్రం ఉండదు..?, నేటి తరం స్టార్ హీరోలు కూడా ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికితే అదృష్టం అని భావించే రేంజ్ ఆయనది.ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవం అలాంటిది, ఇక హీరోయిన్స్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, రజినీకాంత్ సినిమా అంటే వాళ్లకి జాక్పాట్ తగిలినట్టే. ఇది వరకు ఆయనతో చేసిన హీరోయిన్స్ అందరూ జీరో నుండి ప్రారంభం […]

Written By:
  • Vicky
  • , Updated On : March 30, 2023 / 10:30 PM IST
    Follow us on

    Manisha Koirala : ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చెయ్యడానికి ఎవరికీ మాత్రం ఉండదు..?, నేటి తరం స్టార్ హీరోలు కూడా ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికితే అదృష్టం అని భావించే రేంజ్ ఆయనది.ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవం అలాంటిది, ఇక హీరోయిన్స్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, రజినీకాంత్ సినిమా అంటే వాళ్లకి జాక్పాట్ తగిలినట్టే.

    ఇది వరకు ఆయనతో చేసిన హీరోయిన్స్ అందరూ జీరో నుండి ప్రారంభం అయ్యి, సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు.అయితే ఒక హీరోయిన్ మాత్రం రజినీకాంత్ సినిమా వల్లే తన సినీ కెరీర్ ముగిసిపోయింది, తనకి పూర్తిగా అవకాశాలు రావడం తగ్గిపోయాయి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.ఆ హీరోయిన్ మరెవరో కాదు, మనీషా కొయిరాలా.ఈ నేపాలీ బ్యూటీ కి అప్పట్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

    తెలుగు, హిందీ మరియు తమిళం అని తేడా లేకుండా ప్రతీ భాషలోనూ నటించి సూపర్ హిట్స్ అందుకొని, పాన్ ఇండియా రేంజ్ లో ఒక వెలుగు వెలిగింది.అలా కెరీర్ దూసుకుపోతున్న ఈమెకి సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘బాబా’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

    ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల రజినీకాంత్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం పడలేదు కానీ, మనీషా కొయిరాలా కెరీర్ మాత్రం సర్వనాశం అయ్యింది.ఈ విషయం స్వయంగా ఆమెనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.తానూ ఎన్నో హిట్స్ మరియు సూపర్ హిట్స్ సినిమాల్లో నటించానని, కానీ ‘బాబా’ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తన కెరీర్ కి ఎండ్ కార్డు పడినట్టు అయ్యిందని చెప్పుకొచ్చింది మనీష కొయిరాలా.ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.