
Sourav Ganguly Biopic: మన భారత దేశ క్రికెట్ కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ అందించిన సేవలు చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేము.తన సారథ్యం లో ఎంతో మంది లెజెండ్స్ కి అవకాశాలు అందించి, వాళ్ళని ఛాంపియన్స్ గా తీర్చి దిద్దడం లో ఆయన ఎంతో కృషి చేసాడు.ఇండియన్ టీం అంటే ఉత్తర దేశాలకు ముచ్చమటలు పట్టించే స్థాయిలో మన జట్టుని తయారు చేసాడు.అలాంటి దిగ్గజం కెరీర్ లో కేవలం విజయాలే కాదు, అపజయాలు కూడా ఉన్నాయి.
ఒకానొక్క దశలో ఫామ్ కోల్పోయిన గంగూలీ ని BCCI టీం నుండి తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.మళ్ళీ ఆయన తిరిగి జట్టులోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలను ఇప్పటికీ మనం మరచిపోలేము.అలా గంగూలీ జీవితం ఎత్తుపల్లాలతో మరియు భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది.ప్రస్తుతం BCCI చీఫ్ గా విధులను నిర్వహిస్తున్న గంగూలీ బయోపిక్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు ప్రారంభం అయ్యాయి.
ఈ బయోపిక్ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నాడట.ఇందుకోసం ఆయన అతి త్వరలోనే కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం.అంతే కాదు గంగూలీ సొంత ఇల్లు మరియు మోహన్ బగాం క్లబ్ వంటి ప్రదేశాలలో తిరిగి ఆయన గురించి మనకి తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోబోతున్నారట మూవీ టీం.జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికీ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ బయోపిక్ లో నటించి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు రణబీర్ కపూర్.’సంజు’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా 350 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.ఇందులో సంజయ్ దత్ గా రణబీర్ కపూర్ పరకాయప్రవేశం చేసి శబాష్ అనిపించాడు.ఈ సినిమా చూసిన తర్వాతనే బయోపిక్ అంటే రణబీర్ కపూర్ తోనే తియ్యాలని ఫిక్స్ అయ్యిందట జీ స్టూడియోస్.త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి.