
Bill Gates On India: మన దేశం గురించి ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు పొగిడితే మన రోమాలు నిక్కపొడుచుకోవడం సహజం.అలాంటిది ప్రపంచం లోనే అత్యంత ధనువంతులలో ఒకరిగా పేరు గడించిన మైక్రో సాఫ్ట్ కంపెనీస్ అధినేత బిల్ గేట్స్ ఇటీవల మన ఇండియా పై చేసిన వ్యాఖ్యలు వింటే మన రోమాలు నిక్కపొడుచుకోక తప్పదు.
‘గేట్ నోట్స్’ అనే బ్లాగ్ లో ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచం ఎన్నో సంక్షోభాలను ఎదురుకోవడం తలమునకలై ఉంటే భారత దేశం మాత్రం వాటికి పరిష్కారం చూపి భవిష్యత్తు పై ఆశలు చిగురించేలా చేస్తుంది.మన భూమి పై ఉన్న ఇతర దేశాలలో లాగానే భారత్ లో కూడా వనరులు చాలా పరిమితం.అయ్యినప్పటికీ ఆ సవాళ్ళను వాళ్ళు సమర్థవతంగా ఎదురుకోవడం లో శబాష్ అనిపించుకున్నారు.ఎంత జటిలమైన సమస్యలు ఉన్నా కూడా ఒకే ఒక్క పరిష్కారం తో మార్గం చూపగల సత్తా భారత్ లో ఉంది.ఇదే భారత్ సాధించిన పురోగతికి నిదర్శనం’ అంటూ ఆయన కొనియాడారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచం లోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో ఒకటి భారత్..ఇక్కడ ఏ రోగం వచ్చిన క్షణాలలోనే కోట్ల మందికి వ్యాప్తి చెందుతుంది.అలా ఆ దేశాన్ని హడలు పుట్టించిన పోలియో ని నియంత్రణలోకి తెచ్చింది.ప్రాణాంతక వ్యాధి HIV ని వ్యాప్తి చెందకుండా చేసింది, పేదరికాన్ని కూడా బాగా కంట్రోల్ చేసింది.శిశుమరణాలను తగ్గించింది, పారిశుద్యం విషయం లో అయితే ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది, ఆర్ధిక సేవలను అందించేందుకు సౌకర్యాలను బాగా పెంచింది,ఇలా అన్ని విధాలుగా భారత్ సాధిస్తున్న పురోగతి చూస్తుంటే ముచ్చట వేస్తుంది.ఇప్పుడు ప్రపంచం లో ఎక్కడాలేని విధంగా భారత్ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారిపోయింది,అంతేకాకుండా డయేరియా వ్యాధికి కూడా వాక్సిన్ కనుగొంది’ అంటూ భారత్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.ఇది ఇలా ఉండగా వచ్చే వారం బిల్ గేట్స్ భారత్ లో పర్యటించబోతున్నాడట, ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపాడు.