https://oktelugu.com/

RRR Movie : ఆస్కార్ తో హైదరాబాద్లో రాజమౌళి, కీరవాణి అడుగుపెట్టగానే ఏమైందో తెలుసా?

RRR Movie : ప్రపంచవేదికపై తెలుగోడి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ టీం హైదరాబాద్ లో అడుగుపెట్టింది. సగర్వంగా ఇండియాకు తిరిగి వచ్చింది. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి , రమ, శ్రీవల్లి, కార్తికేయ, కాలభైరవ శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు వీరు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంత తెల్లవారుజామున వచ్చినా కూడా వీరి కోసం అభిమానులు ఎదురుచూసి ఘనస్వాగతం పలకడం విశేషం. రాజమౌళి అభిమానుల కోలాహలం నడుమ ఆస్కార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 17, 2023 / 12:09 PM IST
    Follow us on

    RRR Movie : ప్రపంచవేదికపై తెలుగోడి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ టీం హైదరాబాద్ లో అడుగుపెట్టింది. సగర్వంగా ఇండియాకు తిరిగి వచ్చింది. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి , రమ, శ్రీవల్లి, కార్తికేయ, కాలభైరవ శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు వీరు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

    అంత తెల్లవారుజామున వచ్చినా కూడా వీరి కోసం అభిమానులు ఎదురుచూసి ఘనస్వాగతం పలకడం విశేషం. రాజమౌళి అభిమానుల కోలాహలం నడుమ ఆస్కార్ తో వచ్చి మీడియాతో మాట్లాడలేదు. కేవలం ‘జైహింద్’ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.

    ఇక ఆస్కార్ అవార్డుల తర్వాత మొదట జూ.ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చేశాడు. అనంతరం రాజమౌళి ఫ్యామిలీ వచ్చింది. ఇక రాంచరణ్ ఈరోజు వస్తున్నారు.

    రాజమౌళి, కీరవాణి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే అభిమానులు ‘ఆస్కార్’ అంటూ నినాదాలు చేశారు. కీరవాణి, రాజమౌళిని చుట్టుముట్టారు. దీనికి రాజమౌళి జైహింద్ అంటూ బస్సు ఎక్కి వెళ్లిపోయారు. ఈ కోలహలం చూసి కీరవాణి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.