
BB Jodi: శ్రీసత్య అంటే నటుడు అర్జున్ కళ్యాణ్ కి పిచ్చి ప్రేమ. ఆమె కోసమే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాడు. ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు. గేమ్ వదిలేసి ఆమె చుట్టూ తిరిగాడు. హౌస్లో ఉన్నన్ని రోజులు శ్రీసత్య నామస్మరణ చేశాడు. ఆమె ఇంకెవరితోనైనా క్లోజ్ గా ఉంటే నొచ్చుకునేవాడు. శ్రీసత్య అంతగా పట్టించుకునేది కాదు. అయినా ఆమెను వీడేవాడు కాదు. ఎలిమినేషన్ నాడు చిన్నపిల్లోడిలా ఏడ్చాడు. బయటకు వెళ్ళిపోతున్నందుకు కాదు, శ్రీసత్యకు దూరం అవుతున్నందుకు బాధపడ్డాడు. నువ్వు గేమ్ బాగా ఆడు. నేను బయట నీ కోసం క్యాంపైన్ చేస్తాను. మీ పేరెంట్స్ ని చూసుకుంటానని హామీ ఇచ్చి మరీ పోయాడు.
చెప్పినట్లే సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా శ్రీసత్య కోసం బాగానే కష్టపడ్డాడు. శ్రీసత్య ఫైనల్ వీక్ వరకు వెళ్లారు. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ కారణంగా ఫైనల్ ఛాన్సులు కోల్పోయింది. శ్రీసత్య బయటకు వచ్చాక అర్జున్ ఆమెను ఎంత వరకు ఇంప్రెస్ చేశాడో తెలియదు. బీబీ జోడి వేదికగా వీరిద్దరి లవ్ డ్రామా చూసే ఛాన్స్ ప్రేక్షకులకు దక్కింది. స్టార్ మా లో కొద్దిరోజుల క్రితం బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో ప్రారంభమైంది.
మాజీ కంటెస్టెంట్స్ ని జోడీలుగా చేసి షో కండక్ట్ చేస్తున్నారు. అర్జున్ కళ్యాణ్ కి జంటగా వాసంతి వచ్చింది. అయితే శ్రీసత్యను ఇస్తే బాగుండేదని మనోడి ఫీలింగ్. శ్రీసత్య యూట్యూబర్ మెహబూబ్ తో జతకట్టారు. మెహబూబ్ బేసిక్ గా మంచి డాన్సర్. శ్రీసత్యలో కూడా డాన్స్ స్కిల్స్ ఉన్నాయి. మెస్మరైజింగ్ పెర్ఫార్మన్స్ తో శ్రీసత్య-మెహబూబ్ షోకి హైలెట్ గా నిలుస్తున్నారు. ఇక వీరిద్దరినీ స్టేజ్ మీద చూసి అర్జున్ సహజంగానే నొచ్చుకుంటున్నాడు. స్పష్టంగా అది ముఖంలో కనిపిస్తుంది.

కాగా లేటెస్ట్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ గా ఉన్న ముక్కు అవినాష్ షాకింగ్ కామెంట్ చేశాడు. శ్రీసత్యతో మెహబూబ్ పెళ్లి అన్నాడు. అవినాష్ కామెంట్ కి షోలో ఉన్నవారందరూ షాక్ అయ్యారు. మీరేదో ప్లాన్ తో వచ్చినట్లు ఉన్నారు. పెళ్లి అంటే పెద్దలు ఉండాలి, పంతులు ఉండాలని యాంకర్ శ్రీముఖి అన్నారు. పెళ్లి పెద్దలుగా తరుణ్ మాస్టర్, రాధమ్మ వ్యవహరిస్తారని అవినాష్ అన్నాడు. సడన్ గా అవినాష్ శ్రీసత్య-మెహబూబ్ పెళ్లి టాపిక్ ఎందుకు తెచ్చాడనేది అర్థం కాలేదు. మరి దీనిపై స్పష్టత రావాలంటే నెక్స్ట్ బీబీ ఎపిసోడ్ చూడాలి.
Also Read: Pathan Box Office Collection: 20 రోజుల్లో 1000 కోట్లు..చరిత్ర సృష్టించిన షారుక్ ఖాన్ ‘పఠాన్’