
Senior NTR- Junior NTR: ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ లెజెండ్. ఆయన నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు. ఎన్టీఆర్ రూపం పుణికిపుచ్చుకున్న వాడిగా జూనియర్ కి పేరుంది. రూపమే కాకుండా నటన, డైలాగ్ డెలివరీలో అంతటివాడు అనిపించాడు. యమదొంగ సినిమాలో యంగ్ యముడిగా ఎన్టీఆర్ నటన, ఆహార్యం అద్భుతం. ఇక తాతయ్య దాన వీర శూర కర్ణ మూవీలో చెప్పిన ”ఏమంటివీ ఏమంటివీ” డైలాగ్ ని ఆధునీకరించి యమదొంగ చిత్ర నేపధ్యానికి తగ్గట్లు మార్చి చెప్పారు. జూనియర్ డైలాగ్ చెప్పిన విధానం తాతను మైమరిపించింది.
Also Read: BB Jodi: అర్జున్ కళ్యాణ్ కి షాక్… మెహబూబ్ తో శ్రీసత్య పెళ్లి!
ఈ తాతామనవళ్ల జీవితాల్లో రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఇష్టపడిన హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి వరకు వెళ్లారు. చివరి నిమిషంలో కొన్ని కారణాల వలన వెనక్కి తగ్గారు. సీనియర్-జూనియర్ భగ్న ప్రేమకథలు ఏమిటో చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే మేనమామ కూతురు బసవతారకంను పెళ్లి చేసుకున్నారు. స్టార్ గా ఎదిగాక ఆయన హీరోయిన్ కృష్ణకుమారిని ఇష్టపడ్డారు. ఆమెతో వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో మానసికంగా దగ్గరయ్యారు. అదే భావన ఎన్టీఆర్ పై కృష్ణకుమారికి కూడా కలిగింది. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.
గుడిలో నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ విషయాన్ని తమ్ముడు త్రివిక్రమరావుకి ఎన్టీఆర్ చెప్పాడు. విజయవాడలో ఉన్న త్రివిక్రమ్ రావు హుటాహుటిన చెన్నై వచ్చాడు. నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్ళాడు. కాసేపట్లో పెళ్లి కావడంతో పట్టు చీరకట్టుకొని ఆమె ముస్తాబై ఉన్నారట. త్రివిక్రమ్ రావు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ గన్ చూపించి చంపేస్తా అని కృష్ణకుమారిని బెదిరించాడు. భయంతో కృష్ణకుమారి బెంగుళూరుకి పారిపోయారట. తర్వాత అన్నయ్య ఎన్టీఆర్ కి నచ్చజెప్పి రెండో పెళ్లి ఆలోచన విరమింపజేశాడు. అలా కృష్ణకుమారితో ఎన్టీఆర్ లవ్ స్టోరీ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ముంబై హీరోయిన్ సమీరా రెడ్డిని ప్రేమించాడు. నరసింహుడు మూవీలో సమీరా రెడ్డి నటించారు. ఆ సమయంలో మనసులు దగ్గరయ్యాయి. సురేందర్ రెడ్డితో చేసిన అశోక్ సినిమాకు ఆమెను సజెస్ట్ చేశాడు. ఇద్దరి మధ్య బంధం ముదిరింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. సమీరా రెడ్డితో పెళ్ళికి ససేమిరా అన్నారు. కుటుంబ సభ్యుల నిర్ణయానికి లోబడి ఎన్టీఆర్ ప్రేమను వదులుకున్నాడు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని హరికృష్ణ బంధువుల అమ్మాయి లక్ష్మీ ప్రణతితో వివాహం చేశారు.