https://oktelugu.com/

Srimukhi Instagram photos : కొంగు చాటు నుండి తొంగి చూస్తున్న శ్రీముఖి నడుము… ఇంత గ్లామర్ ఎక్కడ దాచిందిరా బాబు!

శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే ఓ సందేహం రావడం ఖాయం. టాలీవుడ్ కి కావాల్సిన టాప్ హీరోయిన్ మన పక్కనే యాంకర్ రూపంలో తిరుగుతుంది. దర్శక నిర్మాతలు గుర్తించలేకపోతున్నారు. హాట్నెస్ , హోమ్లీ నెస్ కలబోసిన ఈ మోడ్రన్ రాములమ్మకు బ్రేక్ రావాలే కానీ వెండితెరను దున్నేయడం ఖాయం. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ మనసులు దోచేస్తుంది. ఇంత అందం ఇన్నాళ్ళు ఎక్కడ దాచిందన్న అనుమానం కలుగుతుంది. ఆరెంజ్ కలర్ లంగా ఓణీలో కుందపుబొమ్మలా తోచింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2023 / 01:47 PM IST
    Follow us on

    శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే ఓ సందేహం రావడం ఖాయం. టాలీవుడ్ కి కావాల్సిన టాప్ హీరోయిన్ మన పక్కనే యాంకర్ రూపంలో తిరుగుతుంది. దర్శక నిర్మాతలు గుర్తించలేకపోతున్నారు. హాట్నెస్ , హోమ్లీ నెస్ కలబోసిన ఈ మోడ్రన్ రాములమ్మకు బ్రేక్ రావాలే కానీ వెండితెరను దున్నేయడం ఖాయం. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ మనసులు దోచేస్తుంది. ఇంత అందం ఇన్నాళ్ళు ఎక్కడ దాచిందన్న అనుమానం కలుగుతుంది.

    ఆరెంజ్ కలర్ లంగా ఓణీలో కుందపుబొమ్మలా తోచింది. ఇక ఓణీ పైట చాటు నుండి నడుము తొంగి చూస్తుండగా గుండెలకు గాయం అవుతుంది. ఈటీవీలో ప్రసారమయ్యే మిస్టర్ అండ్ మిసెస్ షో తాజా ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఇలా సిద్ధమయ్యారు. షోలో ఎంటర్టైన్మెంట్ ఉన్నా లేకున్నా శ్రీముఖి గ్లామర్ చూసి ఆడియన్స్ పడిపోతారనిపిస్తుంది. అసలు ఛానల్ మార్చే పరిస్థితి లేదు.

    శ్రీముఖి ఇంత అందగత్తె కాబట్టే బుల్లితెరను దున్నేస్తుంది. ఇప్పుడు యాంకరింగ్ లో అగ్రస్థానం శ్రీముఖిదే. సుమ, రష్మీ సైతం వెనుకబడ్డారు. ఇక అనసూయ పూర్తిగా యాంకరింగ్ మానేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీముఖి హవా నడుస్తోంది. రానున్న కాలంలో ఈ రంగంలో ఆమె మరిన్ని విజయాలు సాధించే సూచనలు కలవు.

    అయితే శ్రీముఖి మెయిన్ టార్గెట్ హీరోయిన్ కావడమని తెలుస్తుంది. ఆ దిశగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీముఖి పాపులారిటీ బాగా పెరిగిన నేపథ్యంలో దర్శక నిర్మాతలు సైతం చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో శ్రీముఖి స్క్రిప్ట్స్ వింటున్నారట. త్వరలో ఆమె హీరోయిన్ గా కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించే సూచనలు కలవు. ఇక చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి స్పెషల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

    మరోవైపు శ్రీముఖి పెళ్లి వార్తలు తరచుగా హల్చల్ చేస్తున్నాయి. ఈ కథనాలపై శ్రీముఖి మండిపడుతున్నారు. నిరాధార పుకార్లు ప్రచారం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న నేపథ్యంలో అప్పుడే పెళ్లి ఆలోచన లేదని శ్రీముఖి చెప్పుకొస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో శ్రీముఖి ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నారు. శ్రీముఖి సంపాదన లక్షల నుండి కోట్లకు చేరినట్లు సమాచారం. అనతి కాలంలో ఎదిగిన శ్రీముఖి చాలా మందికి స్ఫూర్తి అని చెప్పొచ్చు.