Srileela : లక్ అంటే ఇది… ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల 

Srileela హీరోయిన్ కావడం ఆషామాషీ విషయం కాదు. కొందరు అమ్మాయిలు ఏళ్ల తరబడి తపస్సు చేస్తూ ఉంటారు. అయినా వాళ్లకు బ్రేక్ రాదు. కొందరు అమ్మాయిలు వస్తూనే సంచలనాలు నమోదు చేస్తారు.అనతికాలంలో స్టార్ హీరోయిన్ హోదా పట్టేస్తారు. హీరోయిన్ శ్రీలీలను కూడా లక్కీ హీరోయిన్ అనొచ్చు. పెళ్ళిసందడి (2021) చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీలీల క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. పెళ్లి సందడి చెప్పుకోదగ్గ విజయం సాధించినప్పటికీ… ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలీల గ్లామర్ దర్శక నిర్మాతలను […]

Written By: NARESH, Updated On : October 5, 2022 6:22 pm
Follow us on

Srileela హీరోయిన్ కావడం ఆషామాషీ విషయం కాదు. కొందరు అమ్మాయిలు ఏళ్ల తరబడి తపస్సు చేస్తూ ఉంటారు. అయినా వాళ్లకు బ్రేక్ రాదు. కొందరు అమ్మాయిలు వస్తూనే సంచలనాలు నమోదు చేస్తారు.అనతికాలంలో స్టార్ హీరోయిన్ హోదా పట్టేస్తారు. హీరోయిన్ శ్రీలీలను కూడా లక్కీ హీరోయిన్ అనొచ్చు. పెళ్ళిసందడి (2021) చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీలీల క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. పెళ్లి సందడి చెప్పుకోదగ్గ విజయం సాధించినప్పటికీ… ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలీల గ్లామర్ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది. అందుకే ఆమె వెనుకబడుతున్నారు. 
 
కాగా ఈ యంగ్ బ్యూటీ ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైనట్లు అధికారిక సమాచారం అందుతుంది. అఖండ మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న బోయపాటి శ్రీను నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. రామ్ పోతినేనితో ఆయన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించనున్నారు. ప్రకటనతోనే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రామ్ కి జంటగా శ్రీలీల అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. 
అది నిజం చేస్తూ నేడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. రామ్మూ-బోయపాటి మూవీలో శ్రీలీల నటిస్తున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. దీంతో హీరోయిన్ శ్రీలీల నక్కతోక తొక్కిందని పరిశ్రమలో అందరూ చెప్పుకుంటున్నారు. సూపర్ ఫార్మ్ లో ఉన్న బోయపాటి హీరో రామ్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయం. అదే సమయంలో పాన్ ఇండియా మూవీలో నటించడం ద్వారా శ్రీలీల ఇమేజ్ ఇతర పరిశ్రమలకు కూడా పాకే అవకాశం కలదు. 
 
ప్రస్తుతం శ్రీలీల ఖాతాలో మూడు తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హీరో రవితేజకు జంటగా ధమాకా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ అవుట్ ఫుట్ అదిరిందంటున్న టాలీవుడ్ వర్గాలు రవితేజ హిట్ కొడుతున్నాడని గట్టిగా చెబుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. అలాగే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీ చేస్తున్నారు. మరో బైలింగ్వెల్ మూవీలో నటిస్తున్నారు. తెలుగులో ఒక్క సాలిడ్ హిట్ కొట్టకుండానే ఆమెకు నిర్మాతలు ఇన్ని చిత్రాల్లో ఆఫర్స్ ఇచ్చారు. రామ్ మూవీతో తెలుగులో మొత్తం నాలుగు చిత్రాలు అవుతాయి.