Sri Satya Elimination: బిగ్ బాస్ సీజన్ 6 మరో రెండు రోజుల్లో ముగియబోతుంది..21 మంది కంటెస్టెంట్స్ తో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, నేడు శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వడం తో 5 కంటెస్టెంట్స్ కి చేరుకుంది..శ్రీహాన్ , రేవంత్ , రోహిత్ , ఆది రెడ్డి మరియు కీర్తి టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు..వీరిలో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి..ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బుధవారం అర్థరాత్రి వరుకు కొనసాగిన ఓటింగ్ లో శ్రీ సత్య కి మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే 50 శాతం తక్కువ ఓట్లు వచ్చాయట.

ఇంత భారీ మార్జిన్ తో తక్కువ ఓట్లు రప్పించుకున్న కంటెస్టెంట్ ఈ సీజన్ కి శ్రీ సత్య నే అని చెప్తున్నారు విశ్లేషకులు..గత వారం లోనే ఇనాయ బదులు ఎలిమినేట్ అవ్వాల్సిన శ్రీ సత్య ఇంత దూరం ఎలా వచ్చిందో అంతుచిక్కడం లేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే శ్రీ సత్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో కాస్త నిదానంగానే గేమ్ ప్రారంభించింది..ఆ తర్వాత నాల్గవ వారం నుండి ఆమె టాస్కుల పరంగా బాగా ఆడుతూ తన ఆట తీరుని మెరుగుపరుచుకుంది..శ్రీహాన్ మరియు రేవంత్ వంటి ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్స్ తో ఆమె స్నేహం చెయ్యడం కూడా ఇన్ని రోజులు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి గల కారణాలలో ఒకటిగా చెప్పొచ్చు..కానీ శ్రీ సత్య ఎన్నడూ కూడా టాస్కుల పరంగా వెనకబడిన దాఖలాలు లేవు..ప్రతీ టాస్కు లోను ఆమె నూటికి నూరు శాతం తన బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేసింది..గెలవడానికి చివరి నిమిషం వరుకు పోరాడింది.

కానీ శ్రీ సత్య కంటే ఇనాయ కాస్త బెటర్ గేమర్ అవ్వడం..ఆమె ఎలిమినేట్ అవ్వడం వల్ల నెటిజెన్స్ లో శ్రీ సత్య మీద నెగటివిటీ వచ్చింది కానీ..టాస్కుల పరంగా మాత్రం కాదు..ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఆమె ఎప్పుడూ హద్దులు మీరు ప్రవర్తించలేదు..ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం ..బిగ్ బాస్ లోకి అడుగుపెట్టకముందు సీరియల్స్ లో విలన్ గా బాగా రాణించిన శ్రీ సత్య కెరీర్ ఇక నుండి ఎలా ఉండబోతుందో చూడాలి.