Adipurush Poster : ఆదిపురుష్ నుండి శ్రీరామనవమి స్పెషల్ పోస్టర్… కొంచెం బెటర్ భయ్యా!

Adipurush Poster : ప్రభాస్ నటిస్తున్న మొదటి పౌరాణిక చిత్రం ఆదిపురుష్. అందులోనూ ఐకానిక్ రాముడు పాత్ర చేస్తున్నారనగానే అభిమానుల అంచనాలు ఆకాశానికి చేరాయి. ఆదిపురుష్ చిత్రం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఫ్యాన్స్ ఆదిపురుష్ విడుదల కోసం ఎంతగానో ఎదురు చూశారు. అయితే టీజర్ చూశాక వాళ్ళ ఆశలన్నీ గల్లంతయ్యాయి. అసలు సినిమా మీద ఆసక్తి పోయే పరిస్థితి ఏర్పడింది. ఆకట్టుకొని ప్రభాస్ లుక్, నాసిరకం గ్రాఫిక్స్ అసహనానికి గురి చేశాయి. ప్రభాస్ వంటి హీరోతో […]

Written By: NARESH, Updated On : March 30, 2023 9:34 am
Follow us on

Adipurush Poster : ప్రభాస్ నటిస్తున్న మొదటి పౌరాణిక చిత్రం ఆదిపురుష్. అందులోనూ ఐకానిక్ రాముడు పాత్ర చేస్తున్నారనగానే అభిమానుల అంచనాలు ఆకాశానికి చేరాయి. ఆదిపురుష్ చిత్రం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఫ్యాన్స్ ఆదిపురుష్ విడుదల కోసం ఎంతగానో ఎదురు చూశారు. అయితే టీజర్ చూశాక వాళ్ళ ఆశలన్నీ గల్లంతయ్యాయి. అసలు సినిమా మీద ఆసక్తి పోయే పరిస్థితి ఏర్పడింది. ఆకట్టుకొని ప్రభాస్ లుక్, నాసిరకం గ్రాఫిక్స్ అసహనానికి గురి చేశాయి. ప్రభాస్ వంటి హీరోతో వందల కోట్లు ఖర్చు చేసి కార్టూన్ మూవీ చేస్తున్నారా? అని మండిపడ్డారు.

దానికి తోడు హిందూ వర్గాల నుండి వ్యతిరేకత. రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్ మనోభావాలు దెబ్బతీశాయంటూ ఉద్యమాలు చేశారు. 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయాల్సిన చిత్రాన్ని ఆరు నెలలు వాయిదా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా ఆదిపురుష్ చిత్రం మీద ఆసక్తి పోయింది. ఈ క్రమంలో విడుదలకు రెండు నెలల ముందు నుండే ఆదిపురుష్ చిత్ర ప్రమోషన్స్ నిర్వహించాలని యూనిట్ నిర్ణయించారు. శ్రీరామనవమి నుండి ఆదిపురుష్ చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తామని దర్శకుడు ఓమ్ రౌత్ వెల్లడించారు.

కాగా పండగను పురస్కరించుకుని నేడు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కూడిన శ్రీరామ నవమి పోస్టర్ ఆకట్టుకుంది. రాముడు వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు చేరుకున్న సంఘటనకు సంబంధించిన పోస్టర్ లా ఉంది. గతంలో విడుదల చేసిన పోస్టర్స్ కంటే ఇది బెటర్ అని చెప్పాలి.

ఆదిపురుష్ టీజర్ సర్వత్రా విమర్శలు అందుకున్న నేపథ్యంలో మరో వంద కోట్లు కేటాయించి మెరుగులు దిద్దారని సమాచారం. నెగిటివ్ కామెంట్స్ మీద దర్శకుడు ఓమ్ రౌత్ స్పందించడం విశేషం. ఇది త్రీడీ ఫార్మాట్ లో థియేటర్ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం. బిగ్ స్క్రీన్ మీద ఆదిపురుష్ అద్భుతం చేస్తుందని సమర్ధించుకున్నారు. అనంతరం త్రీడీ టీజర్ థియేటర్స్ లో విడుదల చేశారు. ఆదిపురుష్ టీజర్ థియేటర్స్ లో చూసిన అభిమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. భూషణ్ కుమార్ ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మించారు. కృతి సనన్ సీత పాత్ర చేశారు. జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది.