Sreemukhi: శ్రీముఖి దెబ్బకు ఇంస్టాగ్రామ్ షేక్ అవుతుంది. సోషల్ మీడియా జనాలకు హార్ట్ అటాక్ వస్తుంది. మొహమాటం లేకుండా పరువాలు చూపిస్తుంటే నోరెళ్ళ బెట్టుకొని చూస్తున్నారు. అంతకంతకూ శ్రీముఖి గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంటే ఇదేం తెగింపు బాబోయ్ అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

తాజాగా శ్రీముఖి షార్ట్ ఫ్రాక్ ధరించి థైస్ కనిపించేలా రచ్చ చేశారు. అసలుకే చాలీ చాలకున్న ఫ్రాక్ ఆమె ఫోజులకు మరింత కురచ అయ్యింది. ఇక శ్రీముఖి బోల్డ్నెస్ పిచ్చెక్కిస్తుండగా నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. లైక్, షేర్స్ తో విరుచుకుపడుతున్నారు. శ్రీముఖి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇంస్టాగ్రామ్ లో శ్రీముఖికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందాలకు అలవాటు పడ్డ జనాలు ఫోటో షూట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. శ్రీముఖిని ఏకంగా 4.6 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇది ఆమెకు ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇంస్టాగ్రామ్ చాలా మంది సెలెబ్రెటీలకు ఆదాయమార్గంగా మారింది.

మరోవైపు స్టార్ యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతున్నారు. ఆమె చేతిలో అరడజను బుల్లితెర షోలు ఉన్నాయి. బీబీ జోడి, జాతిరత్నాలు, మిస్టర్ అండ్ మిసెస్, స్టార్ మా పరివార్ ఎలా పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ యాంకరింగ్ మానేయడం, సుమ రేసులో వెనకబడటం శ్రీముఖికి కలిసొచ్చింది.

మరోవైపు నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. క్రేజీ అంకుల్స్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ గా మారారు. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న శ్రీముఖి స్టార్ హీరోయిన్ కావాలని ఆశ పడుతోంది. ఈ మధ్య ఆమె చిన్న పాత్రలు ఒప్పుకోవడం లేదట. హీరోయిన్ గా అయితేనే చేస్తాను అంటున్నారట.
ఇటీవల శ్రీముఖిపై పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టాయి. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను శ్రీముఖి వివాహం చేసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఈ వార్తలను శ్రీముఖి ఖండించారు. మరో రెండు మూడేళ్లకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. నిరాధార రాతలు రాయకండి అంటూ ఫైర్ అయ్యారు.