Rana Daggubati: టాలీవుడ్ బడా ఫామిలీస్ లో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. మూవీ మొఘల్ రామానాయుడు నిర్మాతగా చరిత్ర సృష్టించారు. ఆయన లెగసీని వెంకటేష్ హీరోగా సురేష్ బాబు నిర్మాతగా ముందుకు తీసుకెళ్తున్నారు. రామానాయుడు ఫ్యామిలీ నుండి మూడో తరం వారసుడిగా రానా ఎంట్రీ ఇచ్చాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ లీడర్ మూవీతో హీరో అయ్యాడు. లీడర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక రానా హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో సినిమాలు చేస్తూ వచ్చారు. బాలీవుడ్ లో కూడా రానాకు ఫేమ్ ఉంది.

కాగా బాహుబలి సిరీస్ తో రానా ఫేమ్ మరింత పెరిగింది. విలన్ రోల్ అయినప్పటికీ నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడం. హీరోతో ఢీ అంటే ఢీ అనే బలమైన రోల్ నేపథ్యంలో రానా కెరీర్ కి బాహుబలి ప్లస్ అయ్యింది. అయితే సోలో హీరోగా ఓ భారీ హిట్ కొట్టి పడలేదు. అరణ్య టైటిల్ తో ప్రయోగాత్మక చిత్రం చేశారు. అరణ్య మూవీలో రానా నటన అద్భుతం అని చెప్పాలి.
ఇక భీమ్లా నాయక్ మూవీలో మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. హీరోగా ఆయన చివరి రిలీజ్ విరాటపర్వం. ఈ మూవీ గత ఏడాది విడుదలై నిరాశపరిచింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కాగా రానా కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. ఈ క్రమంలో ఆయన నటనకు గుడ్ బై చెప్పేశారనే ప్రచారం జరుగుతుంది. అనారోగ్య కారణాలతో ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు.

రానా కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అమెరికాలో ఉండి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. చికిత్స సమయంలో రానా విపరీతంగా బరువు తగ్గారు. మొత్తంగా సినిమాలు మానేయాలని రానా నిర్ణయం తీసుకున్నారట. గతంలో దర్శకుడు గుణశేఖర్ హిరణ్యకశ్యప టైటిల్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇది హోల్డ్ లో పడింది. దానికి రానా నిర్ణయమే కారణం అంటున్నారు.
ఇక బాబాయ్ వెంకటేష్ తో కలిసి ‘రానా నాయుడు’ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది హాలీవుడ్ సిరీస్ రీమేక్. నెట్ఫ్లిక్స్ లో త్వరలో స్టీమ్ కానుంది. కాగా 2020లో రానా మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది.