Sreeleela: రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్స్ లో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ డిమాండ్ సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల..శ్రీకాంత్ కొడుకు హీరో గా నటించిన పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా శ్రీలీల, తన అందం,అభినయం మరియు డ్యాన్స్ తో కోట్లాది మంది మనసులను కొల్లగొట్టింది.

ఇక ఆ తర్వాత ఈ అమ్మడికి అవకాశాల వెల్లువ కురుస్తూనే ఉంది..రీసెంట్ గానే మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం లో హీరోయిన్ గా నటించి మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి..అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒకటైతే..పంజా వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా , రామ్ పోతినేని తో ఒక సినిమా , నితిన్ తో ఒక సినిమా చేయబోతుంది.
వీటితో పాటుగా బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా లో కూడా నటించబోతుంది..ఇలా బుల్లెట్ లాగ దూసుకుపోతున్న శ్రీలీల ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన గురించి చెప్పిన కొన్ని విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆమె మాట్లాడుతూ ‘నేను కనిపించేంత సాఫ్ట్ కాదు..నాకు ముక్కు మీదనే కోపం ఉంటుంది..కోపం వచ్చినప్పుడు అవతల వారిపై చాలా గట్టిగ అరిచేస్తాను..కొన్ని కొన్ని సార్లు దారుణంగా తిట్టేస్తాను కూడా..నా కోపాన్ని ఎక్కువ భరించింది మాత్రం మా అమ్మ గారే,ఆమె మీద ఎన్నోసార్లు అరిచేసాను..కోపం తగ్గిన తర్వాత అమ్మని అన్న మాటలు గుర్తొచ్చి బాగా ఏడ్చేసేదానిని..ఆమె కాబట్టి నన్ను భరించింది..వేరే వాళ్ళు అయితే ఇంట్లో నుండి తరిమేసేవాళ్ళు’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.