Homeట్రెండింగ్ న్యూస్Antarctica Blood Falls Mystery: అంటార్కిటికా లో రక్తప్రవాహం... మిస్టరీ ఇప్పటికి వీడింది

Antarctica Blood Falls Mystery: అంటార్కిటికా లో రక్తప్రవాహం… మిస్టరీ ఇప్పటికి వీడింది

Antarctica Blood Falls Mystery: అంటార్కిటికా… అంటే మనకు మంచు మాత్రమే తెలుసు.. అందులో నివసించే ధ్రువపు ఎలుగుబంట్లు, సీల్ జంతువులు మాత్రమే మనకు తెలుసు.. కానీ అంటార్కిటికా ఖండం ఎన్నో అద్భుతాలకు నెలవు.. ఈ భూమిపై ప్రవహించే అనేక నదులకు ఆ హిమఖండమే నెలవు.. ఒక రకంగా చెప్పాలంటే తాను గడ్డకడుతూ ప్రపంచాన్ని రక్షిస్తోంది అంటార్కిటికా ఖండం.. అక్కడ మంచు కరిగితే నది తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు మునుగుతాయి.. ఇప్పటికే ఆ ఖండంలో మంచు కరగడం మొదలైంది. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్. ఇక మానవుడి మేథో సంపత్తి ఈ స్థాయిలో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ అక్కడ అనేక విషయాలు సవాళ్ళు విసురుతున్నాయి.. అందులో అంటార్కిటికాలో ఎరుపు రంగుతో కూడిన నీటి ప్రవాహం ఒకటి.. 1911లో దీనిని కనుగొన్నారు.. ఎరుపు రంగులో నీటి ప్రవాహం ఉండటంతో దీనికి బ్లడ్ ఫాల్స్ అని పేరు పెట్టారు.. ఇది ఎంసీ ముర్డో డ్రై వ్యాలీలో ఉంది. ఇంతకీ దాని కథా కమామీసు ఏమిటో ఒకసారి తెలుసుకుందామా.

Antarctica Blood Falls Mystery
Antarctica Blood Falls Mystery

మొదట్లో ఈ నీటికి ఎరుపు రంగు ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలకు అంతుపట్టలేదు.. నీటిలో ఆల్గే జాతికి చెందిన శైవలాలు ఉండటంవల్ల ఎరుపు రంగు కనిపిస్తోందని నమ్మేవారు.. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు.. 2017లో ఒక అధ్యయనం ప్రకారం రెండు మిలియన్ సంవత్సరాల క్రితం టైలర్ గ్లేషియర్ ఏర్పడిందని… దాని కింద ఉప్పు నీటి సరస్సు ఉండేదని.. ఆ సరస్సులో అనేక రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని గుర్తించారు. అవి ఏర్పరిచిన రసాయన చర్యల ఆధారంగా నీరు ఎరుపు రంగులో వస్తోందని గుర్తించారు.. ఇక మరో అధ్యయనం ప్రకారం నీటిలోని ఆక్సిడైజ్డ్ ఐరన్ కారణంగా ఆ ఉప్పునీరు ఆక్సిజన్ తో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్లు ఏర్పడుతున్నాయని, అలా క్రమేపి ఎరుపు రంగు సంతరించుకుంటున్నదని తేలింది.. ఈ ప్రక్రియ ఇనుముకు తుప్పు అయితే ఎలా పడుతుందో అలా ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.. అందువల్లే నీరు ముదురు ఎరుపు రంగులో ఉంటుందని నిరూపితమైంది.

Antarctica Blood Falls Mystery
Antarctica Blood Falls Mystery

టైలర్ గ్లేసియర్ కింద సబ్ గ్లేసియల్ నదులు, సబ్ గ్లేసియల్ సరస్సు సంక్లిష్ట నెట్‌వర్క్ ఉంది.అవన్నీ ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి. స్వచ్ఛమైన నీటి కంటే తక్కువ ఘనీభవన స్థానం కలిగి ఉంటుంది. ఉప్పునీరు గడ్డకట్టేటప్పుడు వేడిని విడుదల చేస్తుంది. ఇది మంచును కరిగించి నీటిని ప్రవహించేలా చేస్తుంది.. పరిశోధకుల ప్రకారం, టైలర్ హిమానీనదం ఇప్పుడు నిరంతరం ప్రవహించే నీటిని కలిగి ఉన్న అత్యంత శీతలమైన హిమానీనదం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఉప్పునీరు చివరకు ఎరుపు రంగు ప్రవాహంలోకి చేరుకోవడానికి దాదాపు 1.5 మిలియన్ సంవత్సరాలు పడుతుంది.
నీటి స్థిరమైన ప్రవాహం,అంటార్కిటికా తక్కువ ఉష్ణోగ్రతలు చాలా కాలం పాటు రహస్యంగా ఉన్నాయి. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయోగాలు చేయలేదు కాబట్టి.. ప్రస్తుతం ఆ ఎరుపు ప్రవాహం ఎందుకు వస్తుందో తెలిసింది కాబట్టి దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని అన్వేషించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version