Homeట్రెండింగ్ న్యూస్Soumendra Jena: నాడు పూరి గుడిసెలో నివాసం.. నేడు కోట్లకు అధిపతి.. ఎలా అయ్యాడంటే..!

Soumendra Jena: నాడు పూరి గుడిసెలో నివాసం.. నేడు కోట్లకు అధిపతి.. ఎలా అయ్యాడంటే..!

Soumendra Jena: ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటారు పెద్దలు. అంటే అన్ని కాలాలు ఒకేలా ఉండవు అనేది దీని అర్థం. ప్రతీ మనిషి జీవితంలో ఇలాంటి పరిణామాలు ఉంటాయి. కొన్ని రోజులు బాగా కలిసి వస్తే మరికొన్ని రోజులు ఇబ్బందులు పడతారు. కొందరు పేదవాళ్లు ఆకస్మికంగా ధనవంతులు కాగా, మరికొందరు ధనవంతులు కఠిక పేదరికంలోకి వెళ్తారు.

కాలం కలిసి వస్తే.. కఠిక దారిద్య్రం కూడా దూరం అవుతుంది. దురదృష్టం తలుపు తడితే ధనవంతుడు కూడడా పేదరికంలో కూరుకుపోతారు. ఒడిశాలోని రూర్కెలాలో జన్మించిన సామేంద్ర జెనా పరిస్థితి కూడా ఇదే. అతని బాల్యం టిన్, టార్పాలిన్‌ పైకప్పు ఉన్న చిన్న గుడిసెలో గడిచింది. 1988 నుంచి 2006 వరకు ఒడిశాలో చదువును పూర్తి చేసిన అతను, నెట్‌వర్కింగ్, ఇంటర్నెట్‌ సొల్యూషన్స్‌లో నైపుణ్యం సంపాదించాడు. తర్వాత జెట్‌స్పాట్‌ నెట్‌వర్క్స్‌ అనే సొంత కంపెనీని స్థాపించాడు. కోవిడ్‌ అనంతరం దుబాయ్‌కు మకాం మార్చి, అక్కడ స్థిరపడ్డారు.

లగ్జరీ కార్లు..
సౌమేంద్రకు లగ్జరీ, స్పోర్ట్స్‌ కార్లంటే గొప్ప ఇష్టం. ఫెరారీ 296 ఎఖీ తో పాటు, పోర్సే్చ, జి–వ్యాగన్‌ వంటి వాహనాలు అతని సేకరణలో ఉన్నాయి. అతని మొదటి కారు 2008 టాటా ఇండికా, ఆ తర్వాత మెర్సిడెస్‌–బెంజ్‌ G350d కొన్నారు. దుబాయ్‌లో పోర్సే్చ టేకాన్‌ టర్బో ఎస్, మెర్సిడెస్‌–బెంజ్‌ G63 AMGలను కొనుగోలు చేశారు. ఇటీవల రూ.3.2 కోట్ల విలువైన ఫెరారీ 296 ఎఖీ ని సొంతం చేసుకున్నారు. ఈ కారు డెలివరీ క్షణాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. వీడియోలో భార్య, కొడుకుతో టాక్సీలో డీలర్‌షిప్‌కు వచ్చి, కారును తీసుకున్నారు. వినయపూర్వకమైన జీవితం నుండి అసాధారణ విజయం సాధించిన సౌమేంద్ర కథ అందరికీ స్ఫూర్తిదాయకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular