
Mohan Babu: ఈ వయసులో మోహన్ బాబుకు రాకూడని కష్టం వచ్చింది. ఇద్దరు కొడుకులు గొడవలతో రచ్చకెక్కారు. కుటుంబం పరువు తీశారు. మంచు మనోజ్ ఆవేశం ఆపుకోకుండా విష్ణు తనతో వాగ్వాదం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. ఇలా నా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళ మీద దాడులకు దిగుతున్నాడంటూ ఆరోపణలు చేశారు.మొదట మంచు ఆఫీస్ లో గొడవ మొదలు కాగా… మంచు లక్ష్మి, మనోజ్ అక్కడ నుండి సారథి అనే తమ ఎంప్లాయ్ ఇంటికి వచ్చారట.
వారిని అనుసరిస్తూ సారథి ఇంటికి విష్ణు వచ్చాడట. అక్కడ మరలా గొడవ జరిగింది. అప్పుడే మనోజ్ వీడియో షూట్ చేశాడు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మనోజ్ ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వబోయాడని సమాచారం. మనోజ్-విష్ణు గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మోహన్ బాబు దృష్టికి విషయం వెళ్ళింది. మోహన్ బాబు మనోజ్ కి ఫోన్ చేసి వెంటనే ఫేస్ బుక్ స్టేటస్ లో పోస్ట్ చేసిన ఆ వీడియోని డిలీట్ చేయించాడట. చివాట్లు పెట్టాడట.
మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న విబేధాలు రచ్చకెక్కడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. కొడుకులు చేసిన పనికి కుమిలిపోతున్నారట. ఈ క్రమంలో ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఈ గొడవలన్నీ ఆస్తి పంపకాల కోసమే అట. దీంతో కొడుకులకు సంక్రమించే ఆస్తిని వారికిచ్చేయాలనుకుంటున్నారట. మంచు విష్ణు, మనోజ్ లకు ఇవ్వాలనుకున్న ఆస్తికి సంబంధించిన వీలునామా రాయాలనుకుంటున్నారట.

దీని కోసం ఇద్దరితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారట. మొత్తం ఆస్తిలో కొంత ఇద్దరి కొడుకులకు సమానంగా పంచేయబోతున్నాడట. మంచు లక్ష్మితో పాటు పిల్లలకు, తన పేరున, భార్య పేరున కొంత ఉంచుకోనున్నారట. ఇక మీ జీవితాలు మీవి, నాకు సంబంధం లేదు. ఇచ్చిన ఆస్తి ఖర్చు చేసుకుంటారో, వృద్ధి చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పబోతున్నారట. ఈ మేరకు మోహన్ బాబు నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ టాక్. మోహన్ బాబు దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టారట.