https://oktelugu.com/

Rajamouli- Karthikeya: ఇంతవరకు రాజమౌళిని నాన్నా అని పిలవని కొడుకు కార్తికేయ… షాకింగ్ రీజన్!

Rajamouli- Karthikeya: రాజమౌళి సక్సెస్ కి ఆయన టీం కూడా ఒక కారణం. ఆ టీమ్ లో చాలా మంది ఆయన కుటుంబ సభ్యులే ఉన్నారు. కీరవాణి, రమా రాజమౌళి, శ్రీవల్లి, కాల భైరవ, విజయేంద్ర ప్రసాద్ అలాగే కార్తికేయ రాజమౌళి సినిమాలకు పని చేస్తారు. వీరిలో రాజమౌళి కొడుకు కార్తికేయది కీలక స్థానంగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ తో పాటు రాజమౌళి సినిమాకు సంబంధించిన పలు విషయాలు ఆయన చూసుకుంటారు. ఇక ఆర్ ఆర్ ఆర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 29, 2023 / 08:35 AM IST
    Follow us on

    Rajamouli- Karthikeya

    Rajamouli- Karthikeya: రాజమౌళి సక్సెస్ కి ఆయన టీం కూడా ఒక కారణం. ఆ టీమ్ లో చాలా మంది ఆయన కుటుంబ సభ్యులే ఉన్నారు. కీరవాణి, రమా రాజమౌళి, శ్రీవల్లి, కాల భైరవ, విజయేంద్ర ప్రసాద్ అలాగే కార్తికేయ రాజమౌళి సినిమాలకు పని చేస్తారు. వీరిలో రాజమౌళి కొడుకు కార్తికేయది కీలక స్థానంగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ తో పాటు రాజమౌళి సినిమాకు సంబంధించిన పలు విషయాలు ఆయన చూసుకుంటారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఆస్కార్ రావడంలో కార్తికేయ కీలక పాత్ర పోషించారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఇండియా నుండి ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కలేదు. దీంతో చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది.

    ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసే చేసే ప్రాసెస్ నుండి ఆర్ ఆర్ ఆర్ మూవీ క్యాంపైన్ బాధ్యతలు కార్తికేయ చూసుకున్నాడు. అందుకే ఆస్కార్ వేదికపై కీరవాణి కార్తికేయకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఆస్కార్ ఇండియన్ సినిమాకు దక్కడంలో కార్తికేయ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

    తండ్రి రాజమౌళిని కార్తికేయ నాన్న అని పిలవరట. మొదటి నుండి బాబా అని పిలవడం అలవాటట. అలానే పిలుస్తాడట. నేను జీవితంలో చెడు రోజులు మంచి రోజులు రెండూ చూశాను. ఒక టైం లో కేవలం నెలకు రూ. 3000 లకు పార్ట్ టైం జాబ్ చేశాను. డబ్బుల కోసం కాదు, ఆత్మ సంతృప్తి కోసం చేశాను. అది రాజమౌళి నుండి నేర్చుకున్నాను అన్నారు. కాగా రాజమౌళికి కార్తికేయ స్టెప్ సన్. రమా రాజమౌళి మొదటి భర్త సంతానమే కార్తికేయ. రాజమౌళితో ఆమెకు ఒక కూతురు ఉంది.

    Rajamouli- Karthikeya

    కాగా ఆస్కార్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ రూ. 80 కోట్లు ఖర్చు చేశారనే ఆరోపణల మీద కూడా కార్తికేయ స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ క్యాంపైన్ కోసం మొదట మూడు కోట్లు బడ్జెట్ అనుకున్నాము. ఆర్ ఆర్ ఆర్ నామిషన్స్ లో నిలవడంతో బడ్జెట్ పెంచాము. మొత్తంగా రూ. 8.5 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఆస్కార్ కొనుక్కున్నాము అనడంలో అర్థం లేదు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన అకాడమీ అది. ప్రజల ప్రేమను, జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి ప్రశంసలను కొనగలమా.. అంటూ కార్తికేయ కౌంటర్ ఇచ్చారు.