
Koratala Siva- Brad Minnich: #RRR చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో చెయ్యబోతున్న సినిమా గురించి అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొరటాల శివ గత చిత్రం ఆచార్య బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఈసారి గురి తప్పకూడదు, కొడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేప్ మారిపోవాలి అనే కసితో ఈ సినిమా కథని సిద్ధం చేసాడు.
ఆయన ఈ చిత్రం కోసం రాసిన ప్రతీ మాట వెండితెర మీద అద్భుతాలు సృష్టించబోతోంది.అందుకోసం ఆయన ఎక్కడా కూడా రాజీ పడటం లేదు.ఈ సినిమా కోసం ఆయన ఏకంగా హాలీవుడ్ టెక్నిషియన్స్ ని రంగం లోకి దింపుతున్నాడు.ఇదంతా చూసిన ఫ్యాన్స్ ‘వామ్మో..! మా హీరో తో అసలు ఏమి ప్లాన్ చేస్తున్నావు రా’ అంటూ హైప్ బాగా ఎక్కించుకుంటున్నారు.అయితే నిన్న ఒక హాలీవుడ్ టెక్నిషియన్ తో కొరటాల శివ దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కొరటాల శివ పక్కన ఉన్న అతని పేరు బ్రాడ్ మిన్నిచ్.ఇతను హాలీవుడ్ లో బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్, పోకెమోన్ డిటెక్టివ్ పికచు, ఆక్వామ్యాన్, 300 రైజ్ అఫ్ ది ఎంపైర్, ది ట్విలైట్ సాగా, ది గుడ్ లార్డ్ బర్డ్ వంటి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినెమాలకుఇ VFX సూపర్ వైజర్ గా పని చేసాడు.అలాంటి టెక్నిషియన్ ని ఈ సినిమా కోసం తీసుకొస్తున్నాడు.పోర్టు లో జరిగే కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన సెట్ వర్క్ ని ఈయన పర్యవేక్షణ లో వెయ్యిస్తున్నాడు కొరటాల శివ.

ముందుగా క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశం తోనే షూటింగ్ ని ప్రారంబిస్తారట.రెగ్యులర్ షూటింగ్ ఈ వారం నుండే మొదలు కానుంది.ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించబోతుంది.అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ నాల్గబ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.