Somy Ali: బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అని సల్మాన్ ఖాన్ ని పిలుస్తారు. 56 ఏళ్ల సల్మాన్ ఖాన్ వివాహం చేసుకోలేదు. ఇకపై చేసుకొనే ఆలోచన కూడా లేదు. అయితే ఈ కండల వీరుడు చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపారు. వాటిలో పబ్లిక్ గా సాగించినవి కొన్ని ఉన్నాయి. 90లలో పాకిస్తాన్ మూలాలు కలిగిన అమెరికన్ నటి సోమీ అలీతో సల్మాన్ రిలేషన్ సాగించాడు. పాకిస్థాన్ లో పుట్టిన సోమీ అలీ ఫ్యామిలీ ఫ్లోరిడా వెళ్లి స్థిరపడ్డారు. ఆమె హీరోయిన్ కావాలనే ఆశతో ఇండియాకు రావడం జరిగింది.

సోమీ అలీ 1993లో విడుదలైన కృష్ణ అవతార్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి హీరో. 1994లో వరుసగా కొన్ని హిందీ చిత్రాలు చేశారు. బాలీవుడ్ లో అప్పటికే స్టార్ గా వెలిగిపోతున్న సల్మాన్ ఖాన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సీరియస్ రిలేషన్షిప్ లోకి జారుకున్నారు. సల్మాన్ ఖాన్ హీరోయిన్ సోమీ అలీని వివాహం చేసుకుంటున్నారంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే అదేమీ జరగలేదు. ఆఫర్స్ వస్తున్నప్పటికీ సోమీ అలీ సడన్ గా బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేశారు.
సోమీ అలీ చివరి చిత్రం 1997లో వచ్చిన చుప్. సల్మాన్ ఖాన్ కి సోమీ అలీ బ్రేకప్ చెప్పింది. ఆమె పరిశ్రమను వీడటానికి సల్మాన్ ఖాన్ కూడా ఒక కారణం అనే వాదన ఉంది. సినిమాలు వదిలేశాక సోమీ అలీ అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమె సల్మాన్ తో రిలేషన్ లో ఉన్నప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ని ఒక శాడిస్ట్ గా అభివర్ణించారు.

సల్మాన్ ఖాన్ ఒక ఉమెన్ బీటర్. అమాయకులైన అమ్మాయిలను టార్గెట్ చేసి లైంగికంగా వేధించాడు. అతడు శరీరంపై సిగరెట్లతో కాల్చేవాడు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసేవాడని, సోమీ అలీ చెప్పుకొచ్చారు. సల్మాన్ ఖాన్ పై సోమీ అలీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.కాగా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యాను. 14 ఏళ్ల వయసులో పొరుగింటి వ్యక్తితో రేప్ చేయబడ్డానని గతంలో సోమీ అలీ చెప్పడం జరిగింది. ఇక సల్మాన్ సోమీ అలీతో పాటు సంగీత బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, ఫరియా అలమ్, కత్రినా కైఫ్ లతో సీరియస్ ఎఫైర్స్ నడిపారు. ఐశ్వర్య రాయ్ ని సైతం వేధింపులకు గురిచేశాడు.