Sneha: మిలీనియం ప్రారంభంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది స్నేహ. ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తరుణ్ హీరోగా విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. వస్తూనే యువతను తన వలలో బంధించింది. ప్రియమైన నీకు మూవీతో వచ్చిన ఇమేజ్ తో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి ఇలా వరుస హిట్స్ ఇచ్చింది. అయితే ఆమె ఫోకస్ కోలీవుడ్ పైనే ఎక్కువగా ఉండేది. ఒక దశలో వరుసగా తమిళ చిత్రాలు చేశారు.

మంచి ఆరంభం లభించినా స్నేహ స్టార్ కాలేకపోయారు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల సరసన నటించినా స్నేహను స్టార్ హీరోయిన్ కాగా కన్సిడర్ చేయలేము. 2012 నాటికి స్నేహ హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యారు. దీంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో స్నేహ విలన్ ఉపేంద్ర భార్య రోల్ చేశారు. సెకండ్ హీరోయిన్ నిత్యా మీనన్ కి స్నేహ వదినగా కనిపించారు. అలాగే వినయ విధేయ రామ చిత్రంలో చరణ్ వదిన పాత్ర చేశారు.
కాగా కోలీవుడ్ నటుడు ప్రసన్నను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. 2009లో విడుదలైన తమిళ చిత్రం అచ్చముండు అచ్చముండు లో స్నేహ-ప్రసన్న జంటగా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో ప్రసన్నతో ఆమె ప్రేమలో పడ్డారు. స్నేహ,ప్రసన్న రిలేషన్ లో ఉన్నారని అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఎఫైర్ వార్తలను ఈ జంట ఖండించారు. అనూహ్యంగా 2011లో తమ రిలేషన్షిప్ ప్రకటించారు. 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం.

ఇటీవల ప్రసన్నతో స్నేహ విడిపోయారని వార్తలు వచ్చాయి. విడివిడిగా ఉంటున్న ఈ జంట విడాకులు సిద్దమయ్యారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలను ప్రసన్న, స్నేహ తమదైన రీతిలో ఖండించారు. నటులుగా బిజీగా ఉన్న ఈ జంట హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. తాజాగా ప్రసన్న-స్నేహ రొమాంటిక్ ఫోటో షూట్ చేశారు. పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన స్నేహ కలర్ ఫుల్ గా కనిపించారు . సూటులో ప్రసన్న జెంటిల్ మాన్ లుక్ అదిరిపోయింది. లవ్లీ కపుల్ గార్జియస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.