
Siri: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో కి సంబంధించి రాబొయ్యే రోజుల్లో ఎన్ని సీజన్స్ వచ్చినా, 5 సీజన్ లో కంటెస్టెంట్స్ మధ్య వచ్చిన విబేధాలు, జరిగిన లవ్ ట్రాక్ లు మాత్రం ఏ సీజన్ లో కూడా జరగబోదు అని మాత్రం చెప్పగలం.ముఖ్యంగా సిరి – షణ్ముఖ్ మధ్య జరిగిన రొమాన్స్ మరియు లవ్ ట్రాక్ ని రిపీట్ చెయ్యడం అనేది మాత్రం అసాధ్యం.ఇద్దరికీ ఎవరి వ్యక్తిగత జీవితాల్లో వారికి లవర్స్ ఉన్నారు.సిరి కి శ్రీహాన్ కి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే నిశ్చితార్థం అయ్యింది.
ఇక షణ్ముఖ్ – దీప్తి సునైనా లు కూడా కాబొయ్యే భార్యాభర్తలు, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాల్సింది.కానీ బిగ్ బాస్ హౌస్ లో మనోడు సిరి తో నడిపిన ప్రేమాయణం, మితిమీరిన రొమాన్స్ ఇవన్నీ చూసిన తర్వాత బయటకి రాగానే ఆయనకీ బ్రేకప్ చెప్పేసింది.

బిగ్ బాస్ వల్ల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపించడం ఇదే మొట్టమొదటిసారి..అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సిరి – షణ్ముఖ్ కలుసుకోలేదు, ఇద్దరు ఎవరికీ వారు దూరంగా ఉంటూ డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు.ఇదే విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సిరి ని ఒక యాంకర్ అడగగా ‘హౌస్ లో మా మధ్య జరిగిన కెమిస్ట్రీ ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు.నా వల్ల షణ్ముఖ్ మరియు దీప్తి మధ్య బ్రేకప్ జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.వాళ్లిద్దరూ బ్రేకప్ అయినా తర్వాత కలవడం, మాట్లాడుకోవడం వంటివి కరెక్ట్ కాదు అనిపించింది.అందుకే డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ ఎవరు కెరీర్ లో వాళ్ళు బిజీ గా ఉంటున్నాము.ఎప్పుడైనా ఒక రోజు కలుస్తాము, ఇది జస్ట్ మామూలు గ్యాప్ మాత్రమే’ అంటూ సిరి ఈ సందర్భంగా మాట్లాడింది.