
Bhuma Akhila Priya Fun With Manchu Manoj: మంచు మనోజ్ సింగిల్ స్టేటస్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. భార్య ప్రణతిరెడ్డి విడాకుల అనంతరం ఆయన ఒంటరిగా ఉంటున్నారు. 2019లో మనోజ్ అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. భార్యతో విడిపోయాక మంచు మనోజ్ గత ఏడాది వార్తలకెక్కారు. భూమా మౌనికతో పాటు మనోజ్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో మనోజ్-మౌనికల ఎఫైర్ రూమర్స్ కి బీజం పడింది. మౌనిక కుటుంబంతో కూడా మనోజ్ సన్నిహితంగా ఉంటున్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో మౌనికను మనోజ్ వివాహం చేసుకోబోతున్నాడన్న వాదన మొదలైంది.
ఈ వార్తలను మనోజ్ ఖండించలేదు. ఇక మౌనికతో మనోజ్ ఎఫైర్ తండ్రి మోహన్ బాబుకు ఆగ్రహం తెప్పించిందని గొడవలు జరిగాయన్న వార్తలు సైతం వెలువడ్డాయి. ఈ ఊహాగానాల నడుమ సడన్ గా మనోజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి 3న హైదరాబాద్ లో మనోజ్-మౌనికల వివాహం జరిగింది. అక్క మంచు లక్ష్మి అన్నీ తానై ఈ పెళ్లి తంతు పూర్తి చేశారు. కొద్ది మొత్తంలో సన్నిహితులు, పరిశ్రమ ప్రముఖులు మనోజ్ పెళ్ళికి హాజరయ్యారు.
పెళ్లి అనంతరం అత్తారింటికి మనోజ్ అట్టహాసంగా వెళ్ళాడు. అరడజనుకు పైగా కార్లలో కాన్వాయ్ గా కర్నూల్ వెళ్లడం జరిగింది. భూమా మౌనిక కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ఆళ్లగడ్డలో ఉన్న మౌనిక తల్లిదండ్రుల సమాధులను సందర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా అత్తింట్లో అడుగుపెట్టే ముందు ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. భూమా మౌనిక అక్కైన అఖిల ప్రియ బావతో సరసాలు ఆడింది. కొత్త జంటను గడప వద్ద పేర్లు అడిగే సాంప్రదాయంలో అల్లరి చేశారు.

ఈ బావా మరదళ్ల సరదాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. భూమా అఖిల్ ప్రియ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మంత్రిగా చేయడం విశేషం. భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. అఖిల ప్రియ, మౌనికలతో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. పొలిటికల్ ఫ్యామిలీకి అల్లుడిగా వెళ్లిన మంచు మనోజ్ రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్నారని సమాచారం.