‘Sir’ movie OTT release : ‘సార్’ మూవీ OTT విడుదల తేదీ వచ్చేసింది.. కానీ కండిషన్స్ అప్లై!

Sir Movie OTT : టాలీవుడ్ లోకి తమిళ స్టార్ హీరో ధనుష్ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘సార్’ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ధనుష్ ని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ కి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. […]

Written By: NARESH, Updated On : March 8, 2023 9:44 am
Follow us on

Sir Movie OTT : టాలీవుడ్ లోకి తమిళ స్టార్ హీరో ధనుష్ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘సార్’ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ధనుష్ ని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ కి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

మన దగ్గర మొదటి నుండి మంచి పాపులారిటీ మరియు క్రేజ్ ఉన్న తమిళ హీరోలు సూర్య, రజినీకాంత్ మరియు కార్తీ వంటి హీరోలకు కూడా రీసెంట్ సమయం లో ఇంత వసూళ్లు రాలేదు.కానీ ధనుష్ కి ఒకే ఒక్క సినిమాతో ఇంత వసూళ్లు వచ్చేసరికి తమిళ హీరోలు సైతం అసూయ పడే పరిస్థితి ఏర్పడింది.ఇక మీదట ఒక ప్లానింగ్ ప్రకారం ధనుష్ వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తే ఇక్కడి స్టార్ హీరోలకు పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకుల అభిప్రాయం.

ఇక థియేటర్స్ లో అద్భుతమైన విషయం సాధించిన ఈ సినిమా ఈ నెల 20 వ తారీఖు నుండి ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించబోతున్నట్టు సమాచారం.నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ మొత్తం లో కొనుగోలు చేసిందట.ధనుష్ కి అన్ని ప్రాంతీయ భాషలలో మంచి క్రేజ్ ఉండడం తో ఈ సినిమాని తెలుగు మరియు తమిళం తో పాటుగా హిందీ ,మలయాళం మరియు కన్నడ వెర్షన్స్ కి డబ్ చేసి విడుదల చేయనున్నారట.

ఆ విధంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ధనుష్ క్రేజ్/పాపులారిటీని ఉపయోగించుకుంటుంది.థియేటర్స్ లో అంత మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకి ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించొచ్చు.ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఓటీటీ లో ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఆదరిస్తారు.పైగా అన్నీ భాషలలో విడుదల చేస్తున్నారు కాబట్టి సుమారుగా 5 వారాలపాటు ట్రెండింగ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

అయితే ఈ మూవీని ఇప్పుడే ఓటీటీలో డబ్బులకు విడుదల చేయాలని నెట్ ఫ్లిక్స్ చూస్తోందట.. ఫ్రీ వెర్షన్ ను తర్వాత రిలీజ్ చేస్తుండగా.. పే అండ్ సీ ప్రాతిపదికన డబ్బులు పెట్టి ముందుగా  చూసేవారి కోసం కండీషన్ అప్లై చేస్తోందట.. ఓటీటీలో ముందుగా పే ప్రాతిపదికన రిలీజ్ చేసి  ఆ తర్వాత ఉచితంగా కల్పించాలని యోచిస్తున్నారు. ఈ కండీషన్ పై ధనుష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫ్రీ వెర్షన్ చూపించాలంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈమధ్య ఓటీటీ లో వచ్చే సినిమాలను చాలా తేలికగా పైరసీ చేసేస్తున్నారు.. కానీ ఈ సినిమాని డౌన్లోడ్ చేసిన, ఏదైనా సైట్ లో అప్లోడ్ చేసిన చాలా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆ చిత్ర నిర్మాత నాగ వంశీ తెలిపాడు.