
Sir Collection: తమిళనాడు లో టాప్ మోస్ట్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ధనుష్ తెలుగు లో మొట్టమొదటిసారిగా నటించిన ‘సార్’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కి ‘డీజే టిల్లు’ మరియు ‘భీమ్లా నాయక్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత ఆ రేంజ్ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఇదే.మధ్యలో వచ్చిన బుట్టబొమ్మ , స్వాతి ముత్యాలు వంటి సినిమాలు ఈ సంస్థకి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి.
చదువు యొక్క గొప్పతనాన్ని కమర్షియల్ ఫార్మటు లో అందరికీ రీచ్ అయ్యేవిధంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాని తీర్చి దిద్దిన విధానం అద్భుతం.అందుకే ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటికే ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం ఆరు కోట్ల రూపాయిలు వరకే జరిగింది.ఇది కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే.తమిళం భాష థియేట్రికల్ రైట్స్ ని కూడా లెక్కకడితే 36 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ ని ఈ చిత్రం జరుపుకుంది.తెలుగు లో ఇప్పటికే దాదాపుగా ఆరు రోజులకు కలిపి 13 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు చేసింది.అంటే పెట్టిన డబ్బులకు రెండింతల లాభాలు అన్నమాట.

ఇక తమిళ వెర్షన్ కి సంబంధించి ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం నాలుగు కోట్ల రూపాయిల దూరం లో ఉన్నది.మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి ఈ సినిమా ఆరు రోజులకు గాను 31 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉండడం తో ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
