
Tarakaratna Funeral: గత కొంతకాలం నుండి నారాయణ హృదాలయాల హాస్పిటల్ లో గుండెపోటు వచ్చి చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న ఇటీవలే తన ప్రాణాలను కోల్పోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాదిమంది నందమూరి అభిమానులు అయితే ఆయన మరణాన్ని ఇప్పట్లో జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది.ఎందుకంటే ప్రతీ ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆ గొంతు ఇక మూగబోయింది అనే విషయాన్నీ ఎప్పటికీ నమ్మలేరు.
ఇది ఇలా ఉండగా తారకరత్న అంత్యక్రియల సమయం లో ఇప్పటి వరకు మనం గమనించని ఎంతోమంది నటులు మరియు నందమూరి కుటుంబీకులు తారసపడ్డారు.వారిలో ప్రథమంగా మాట్లాడుకోవాల్సింది కల్యాణ చక్రవర్తి గురించి.ఈయన నందమూరి తారకరామారావు గారి సోదరుడు త్రివిక్రమరావు కుమారుడు.నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కల్యాణ చక్రవర్తి ఆరోజుల్లో ‘అత్తగారు స్వాగతం’,’అత్తగారు జిందాబాద్’, ‘మామ కోడళ్ల సవాల్’, ‘ఇంటి దొంగ’, ‘అక్షింతలు’ , ‘కృష్ణ లీల’ , ‘రౌడీ బాబాయ్’,’దొంగ కాపురం’ వంటి సినిమాలలో హీరో గా నటించాడు.
ఆ తర్వాత దాసరి నారాయణరావు మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం లంకేశ్వరుడు లో చిరంజీవి తమ్ముడిగా నటించాడు.అంతే ఇక ఆ తర్వాత మళ్ళీ ఈయన సినిమాల్లో కనిపించలేదు.హీరో గా అవకాశాలు బాగా తగ్గిపోవడం తో వ్యాపార రంగం లోకి అడుగుపెట్టి గొప్పగా రాణించాడు.ప్రస్తుతం చెన్నై లోనే నివాసం ఉంటున్న కల్యాణ చక్రవర్తి అక్కడి టాప్ మోస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్స్ లో ఒకరిగా చలామణి అవుతున్నాడు.

అయితే ఇన్ని రోజులు ఆయన కనీసం మీడియా ముందు చిన్న ఫోటో లో అయినా కనపడలేదు.సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఎక్కడా లేడు.నిన్న తారకరత్న అన్యక్రియలలోనే ఇన్ని రోజుల తర్వాత కనిపించడం తో ఆయన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.తారకరత్న కి ఇతనితో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్నది.తనతో ఎంతో ప్రేమగా ఉండే తారకరత్న ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తో కల్యాణ చక్రవర్తి బాధ ఊహాతీతం.
