
Simhadri Re Release: టాలీవుడ్ లో గత కొంత కాలం నుండి రీ రిలీజ్ ట్రెండ్ ఒక రేంజ్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.పోకిరి సినిమాతో ప్రారంభమైన ఈ ట్రెండ్ జల్సా సినిమాతో తారాస్థాయికి చేరుకుంది.’జల్సా’ చిత్రం రీ రిలీజ్ ట్రెండ్ లో ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పడం తో ఆ చిత్ర రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి ఇతర హీరోల అభిమానులు కూడా ఈ ట్రెండ్ ని కొనసాగించారు. కానీ ఒక్కరు కూడా జల్సా స్పెషల్ షోస్ రికార్డుని బద్దలు కొట్టలేకపొయ్యారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఖుషి చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది.
రీ రిలీజ్ ట్రెండ్ ఖుషి కలెక్షన్స్ ఒక బెంచ్ మార్క్ లాంటిది. ఈ రికార్డుని కొట్టడం అంత సులువైన విషయం కాదు.అయితే ఈ రికార్డు పై ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్నేశారు.మే 20 వ తేదీన ఎన్టీఆర్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన ఊర మాస్ చిత్రం ‘సింహాద్రి’ అని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.
అయితే సింహాద్రి రీ రిలీజ్ విషయం లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్ ని సృష్టించబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్ ‘నువ్వు విజులేస్తే ఆంధ్ర సోడాబుడ్డి’ పాటకి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఇప్పటి వరకు వరుకు రీ రిలీజ్ ట్రెండ్ లో ఇలాంటివి ఎప్పుడు చెయ్యలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా రీ రిలీజ్ కి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బెన్ఫిట్ షోస్ ని ప్లాన్ చేస్తున్నారు.ఉదయం 5 గంటల ఆట నుండే ఈ షోస్ ప్రారంభం కానున్నాయి.

గతం లో ఖుషి రీ రిలీజ్ కి కూడా ఇలాగే బెన్ఫిట్ షోస్ వేశారు కానీ, అది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసారు. కానీ సింహాద్రి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ ప్రాంతాలలో బెన్ఫిట్ షోస్ వేస్తున్నారు. అన్నీ అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం జరిగితే ఖుషి మొదటి రోజు (4 కోట్ల 30 లక్షలు) రికార్డు ని అవలీల గా బ్రేక్ చేస్తామని నందమూరి ఫ్యాన్స్ ఈ సందర్భంగా చెప్తున్నారు.