Sidhu Moose Wala: ఒక్కగానొక్క కొడుకు.. చేతికి అంది వచ్చాడు. తనకు ఇష్టమైన రాజకీయాల్లో రాణిస్తున్నాడు. ఇక త్వరలో మంచి స్థాయిలోకి ఎదుగుతాడు అనుకుంటున్న తరుణంలో ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపేశారు. ఆ దారుణం విని.. విగత జీవిగా పడిన కొడుకును చూసి.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. రోజులపాటు పస్తులున్నారు. కొడుకు ఫోటో చూసి వేదన చెందారు. ఇలా రోజులు గడుస్తున్నా కొద్దీ దుఃఖం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కొడుకును మర్చిపోలేక.. ఆ తల్లిదండ్రులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు..ఆ నిర్ణయమే ఆ మాతృమూర్తిని 58 సంవత్సరాల వయసులో గర్భం దాల్చేలా చేసింది.
పంజాబ్ లో సిద్ధూ మూసే వాలా గాయకుడిగా రాణించేవాడు. అతడి తల్లిదండ్రుల పేర్లు చరణ్ కౌర్, బాల్ కౌర్ సింగ్. గాయకుడిగా మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అతడు వ్యవహరించేవాడు. యువతలో అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. 2021లో డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో సిద్దు చేరారు. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. స్వతహాగా గాయకుడు కావడంతో బింబిహా భోలే పై రూపొందించిన పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది. తేరి మేరీ జోడి, మోసా జట్ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. సిద్దు ఎదుగుదల ప్రత్యర్థులకు నచ్చేది కాదు. గతంలో అతడికి, అతడి ప్రత్యర్థులకు గొడవలు జరిగాయి. ఆ తర్వాత అతడు కాంగ్రెస్ పార్టీలో మరింత కీలకంగా మారాడు. ఇది జీర్ణించుకోలేని ప్రత్యర్ధులు 2022, మే 29న అతడిని మన్సా జిల్లాలోని జవహర్కే గ్రామం వద్ద సిద్ధూను హత్య చేశారు. అతడు వాడుతున్న కారును కూడా ధ్వంసం చేశారు. ఇప్పటికీ అతడి వయసు 28 సంవత్సరాలు..చరణ్ కౌర్, బాల్ కౌర్ సింగ్ దంపతులకు సిద్దు ఒక్కడే సంతానం. దీంతో అతని జ్ఞాపకాలు మర్చిపోలేక వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
సిద్దు హత్యకు గురైన నేపథ్యంలో మరో బిడ్డను కనాలని చరణ్ కౌర్, బాల్ కౌర్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా ఇటీవల చరణ్ కౌర్ గర్భం దాల్చినట్టు తెలుస్తోంది. మార్చిలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చరణ్ కౌర్ వయసు 58 సంవత్సరాలు. ఆమె భర్త వయసు 60 సంవత్సరాలు. గర్భం దాల్చిన నాటి నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. సిద్దు తండ్రి కాంగ్రెస్ పార్టీ తరఫున త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.