https://oktelugu.com/

Sidharth Malhotra and Kiara Advani : కియారాతో సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి… వీరి ప్రేమ ప్రయాణం ఎక్కడ మొదలై ఇక్కడ వరకు వచ్చిందో తెలుసా? 

Sidharth Malhotra and Kiara Advani Love Story : మరో బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంలో అడుగు పెడుతున్నారు. కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల వివాహానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.  జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలస్ ఈ సెలబ్రిటీ వివాహానికి వేదిక కానుంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన దుస్తుల్లో వధూవరులు మెరవనున్నారు. కియారా-సిద్దార్థ్ ల బంధుమిత్రులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. ఇండియన్ మీడియా మొత్తం ఈ పెళ్లిని ప్రత్యేకంగా కవర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2023 / 09:24 PM IST
    Follow us on

    Sidharth Malhotra and Kiara Advani Love Story : మరో బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంలో అడుగు పెడుతున్నారు. కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాల వివాహానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.  జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలస్ ఈ సెలబ్రిటీ వివాహానికి వేదిక కానుంది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన దుస్తుల్లో వధూవరులు మెరవనున్నారు. కియారా-సిద్దార్థ్ ల బంధుమిత్రులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. ఇండియన్ మీడియా మొత్తం ఈ పెళ్లిని ప్రత్యేకంగా కవర్ చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో సిద్ధార్థ్ తో కియారాకు పరిచయం ఎక్కడ జరిగింది? ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది? ఎలా పెళ్ళికి దారితీసిందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మన పాఠకుల కోసం ఎక్స్ క్లూసివ్ గా సిద్ధార్థ్-కియారాల ప్రేమ ప్రయాణం పరిశీలిద్దాం… 

     

     
    ఫస్ట్ మీటింగ్:
     
    షేర్షా మూవీలో సిద్ధార్థ్-కియారా జంటగా నటించారు. ఆ మూవీ చిత్రీకరణ సమయంలో ఫస్ట్ కలిశారని ఆ పరిచయం ప్రేమగా మారిందని పలువురు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఆంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మొదటిసారి కలిశారు. ఈ విషయాన్ని కరణ్  జోహార్ టాక్ షోలో కియారా స్వయంగా వెల్లడించారు. 
     
    డేటింగ్ రూమర్స్:
     
    2020లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి సౌత్ ఆఫ్రికా సఫారీ టూర్ కి వెళ్ళింది కియారా. జంటగా విదేశీ ట్రిప్ కి వెళ్లిన సిద్ధార్థ్-కియారా మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు మొదలయ్యాయి. వీరి సఫారీ టూర్ ఫోటోలు ప్రముఖంగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాను షేక్ చేశాయి. 
     
    ఫస్ట్ హింట్ ఇచ్చిన కియారా:
     
    కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న కియారాను సిద్దార్ట్ తో రిలేషన్ పై కరణ్ జోహార్ స్పష్టత అడిగారు. రిలేషన్ రూమర్స్ ఖండిస్తున్నావా? అని అడగ్గా ”నేను ఖండించడం లేదు. అలా అని సమర్థించడం లేదు” అని సమాధానం చెప్పారు.  అయితే సిద్ధార్థ్ నీకు ఏమవుతాడు? మిత్రుడా? అని కరణ్ గుచ్చి గుచ్చి అడిగారు. ”కేవలం బెస్ట్ ఫ్రెండ్ కాదు, అంతకు మించి”, అని కియారా సమాధానం చెప్పారు. అలా రూమర్స్ ని బలపరిచే విధంగా కియారా కామెంట్స్ చేశారు. 
     
    కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్:
     
    2023లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కియారా-సిద్ధార్థ్ కలిసి జరుపుకున్నారు. దర్శక నిర్మాత కరణ్ జోహార్ దుబాయ్ లో గ్రాండ్ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేయగా ఆ పార్టీలో కియారా,సిద్దార్థ్ పాల్గొన్నారు. అప్పటికే వీరి పెళ్లి వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. 
     
    కియారా ఇంస్టాగ్రామ్ పోస్ట్: 
     
    ఈ ఏడాది జనవరిలో కియారా సిద్దార్థ్ తో తన రిలేషన్ పై పూర్తి స్పష్టత ఇచ్చింది. 16వ తేదీకి సిద్ధార్థ్ బర్త్ డే నేపథ్యంలో రొమాంటిక్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఇంత వరకు ఎవరూ చూడని ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి విషెస్ చెప్పారు. ఓ ట్రిప్ లో జంటగా దిగిన ఆ ఫోటో నెటిజెన్స్ ని ఆకర్షించింది. అలా సిద్దార్థ్ తో కియారా ప్రేమ ప్రయాణం పెళ్లి వరకూ సాగింది.