Viral News: మద్యం మత్తులో ఏవేవో జరుగుతుంటాయి. ఎంతటి వారికైనా మద్యం లోపల పడిందంటే ఒళ్లు తెలియక కష్టాలు కొనితెచ్చుకుంటారు. ప్రమాదాలకు కారణంగా మారి బతుకు దుర్భరం చేసుకున్న సంఘటనలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ మద్యం బాటిళ్ల మీద లేబుల్ వేసి మరీ సర్కారు అమ్ముతోంది. మద్యపానంతో ఆరోగ్యమే కాకుండా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో ఎన్నో అనర్థాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

మద్యం మత్తులో ఓ ఎస్సై చేసిన పొరపాటు అతడిని చితకబాదేలా చేసింది. తాగిన మైకంలో అతడు చేసిన నిర్వాకానికి దేహశుద్ధి చేసిన ఘటన సంచలనం కలిగించింది. ఆదర్శంగా ఉండాల్సిన అధికారిగా మసలుకోవాల్సిన అతడి ప్రవర్తన అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎస్సై చిత్తుగా తాగి తన ఇంటికి వెళ్లాల్సింది పోయి ఇతరుల ఇంటికి వెళ్లడంతో దొంగ అని భావించారు. ఎస్సైని పట్టుకుని చితకబాది చెట్టుకు కట్టేశారు. స్థానికుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. దీంతో పరువు పోగొట్టుకున్నాడు.
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ లో ఎస్సైగా విధులు నిర్వహించే ఎస్సై తన ఇంటికి వెళ్లే క్రమంలో తాగి ఉండటంతో దారి తప్పి వేరే వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన ఇంటి యజమాని ఎస్సైని దొంగగా భావించి స్థానికులు సాయంతో చెట్టుకు కట్టి చితకబాదారు. తరువాత పోలీసులకు సమాచారం అందించడంతో కానిస్టేబుళ్లు అతడిని ఎస్సైగా గుర్తించి విడిపించారు. దీంతో మద్యం సేవించిన ఎస్సై చేసిన పొరపాటుకు పరువు పోయింది. తాగిన మత్తులో ఎస్సై అలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాధ్యత గల అధికారిగా ఉంటూ ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడాన్ని అందరు జీర్ణించుకోలేకపోతున్నారు. దొంగగా ఇతరుల ఇంటికి రావడంతో గొడవకు కారణమైంది. స్థానికుల చేతిలో దేహశుద్ధి చేయించుకున్న ఎస్సైపై చట్టపరమైన చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. మద్యం మత్తులో ఎస్సై నిర్వాకం ఆందోళనలకు తావిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే దొంగావతారం ఎత్తడం వివాదాలకు కారణమవుతోంది. ప్రజలకు అండగా నిలవాల్సిన అధికారే దారి తప్పడం గమనార్హం.