Homeఎంటర్టైన్మెంట్Shukoor Vakeel Marriage: పిల్లలకు ఆస్తి కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటున్న నటుడు

Shukoor Vakeel Marriage: పిల్లలకు ఆస్తి కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటున్న నటుడు

Shukoor Vakeel Marriage
Shukoor Vakeel Marriage

Shukoor Vakeel Marriage: ‘ఆడజన్మకు పరిపూర్ణత ఇల్లాలు’ అని అంటారు. అంటే ఒక స్త్రీ.. పురుషుడిని వివాహం చేసుకున్న తరువాతే తనకు సంపూర్ణ జీవితం అని అంటారు. ఇదే సమయంలో పురుషుడు సైతం ఎన్నో పూజలు, ఎన్నో నోములు చేస్తేనే నాకు మంచి భార్య దొరుకుతుందని ఆశిస్తాడు. ఇలా ఆలోచించిన వారు జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటారు.. జీవితాంతం కలిసుంటారు. కానీ కొందరు మనస్పర్థల కారణంగా పెళ్లయిన కొద్దికాలానికే విడిపోతుంటారు.. మళ్లీ ఇతరులను పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఓ ప్రముఖ సినీ నటుడు తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడట. ఇప్పటికే ఆమెను పెళ్లి చేసుకొని ముగ్గరు పిల్లలకు జన్మనిచ్చాడు. కానీ ఇప్పుడు మళ్లీ ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఇంత వింతైనా ఆలోచన ఎందుకు వచ్చిందని కొందరికి డైట్ రావచ్చు. క్లారిఫై కోసం కిందికి వెళ్లి చదండి.

ఈ మధ్య ఆస్తి తగాదాలు ఎక్కువయ్యాయి. తండ్రి ఆస్తిని అనుభవించడానికి కుమారులతో పాటు కూతుళ్లు సైతం కోర్టులకెక్కుతున్నారు. ప్రత్యేక చట్టాలు వచ్చినందున వాటిని అవకాశంగా చేసుకొని చాలా మంది తండ్రి ఆస్తి కోసం పోరాడుతున్నారు. అయితే ముస్లింలల్లో వారికున్న చట్టం ప్రకారం తండ్రి చనిపోతే ఆ ఆస్తి కూతుళ్లకు వచ్చే అవకాశం లేదు. మరణించిన వ్యక్తి సోదరులు లేదా సోదరీమణులకు వర్తిస్తుంది. ఈ సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రముఖ నటుడు అలాంటి పరిస్థితి రాకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

కేరళకు చెందిన సినీ నటుడు షుకూర్ కు షీనాతో 1994 అక్టోబర్ 6న వివాహం జరిగింది. కాలక్రమంలో వీరికి ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. అయితే దంపతులిద్దరూ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు అయినందున తన ఆస్తి కూతుళ్లకు దక్కదని అనుకున్న షుకూర్ తన భార్యను మళ్లి పెళ్లి చేసుకున్నాడు. అంటే ప్రత్యేక వివాహ చట్టం కింద మళ్లీ తన భార్యను పెళ్లి చేసుకోవడం ద్వారా ఈ ఆస్తి కూతుళ్లకు చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆయన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పునర్వివాహం చేసుకోనున్నాడు.

Shukoor Vakeel Marriage
Shukoor Vakeel Marriage

దేశంలో ప్రతీ తండ్రి తన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో షుకూర్ సైతం తన కూతుళ్లకు తన ఆస్తి దక్కాలనే ఉద్దేశంతో తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా వివాహం చేసుకోవడం ద్వారా ఇప్పుడు తండ్రి ఆస్తి కూతుళ్లకు చెందుతుందని ఆయన చెబుతున్నారు. కానా షుకూర్ నటుడితో పాటు న్యాయవాది కూడా. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

 

ఇంతకీ ఫాక్స్ కాన్ పెట్టుబడి ఎక్కడ? తెలంగాణలోనా, కర్ణాటకలోనా? || Foxconn || Telangana || Karnataka

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version