Shruti Hassan: సోషల్ మీడియా యుగంలో ప్రతి విషయాన్ని తప్పు పట్టేందుకు ఒక వర్గం రెడీగా ఉంటారు. సమాజంలో నెగిటివ్ యాటిట్యూడ్ తో బ్రతికేసే జనాల శాతమే ఎక్కువ. తాజాగా శృతి హాసన్ ఈ ట్రోలర్స్ టార్గెట్ చేశారు. ఆమె నటిస్తున్న చిత్రాల్లో హీరోలు సీనియర్స్ కావడంతో డబ్బుల కోసం తండ్రి వయసున్న హీరోలతో సినిమాలు చేస్తున్నావా? నీకు ఆఫర్స్ లేవా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. సదరు ట్రోల్స్ పై శృతి ఘాటుగానే స్పందించారు. చిత్ర పరిశ్రమలో ఏజ్ అనేది కేవలం నెంబర్ మాత్రమే. గతంలో నాకంటే ముందు అనేక మంది హీరోయిన్స్ తమకంటే డబుల్ వయసున్న హీరోలతో నటించారు… అందుకు నేనేమీ అతీతం కాదంటూ శృతి ట్రోలర్స్ కి సమాధానం చెప్పారు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో సీనియర్ హీరోలు నటిస్తున్నారు. చిరంజీవి, బాలయ్యల వయసు ఆమె వయసుకు దాదాపు డబుల్ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వీరిద్దరూ 60 ప్లస్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. చాలా మంది యంగ్ హీరోయిన్స్ చిరంజీవి’ బాలయ్యలతో ఆడిపాడారు. శృతి హాసన్ మాత్రమే విమర్శలపాలు కావడానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. శృతి స్టార్ కిడ్.ఆమె తండ్రి కమల్ హాసన్ కొంచెం అటూ ఇటుగా బాలయ్య-చిరు జనరేషన్ వాడు.
అందుకే పోలిక వచ్చింది. నిజం మాట్లాడుకోవాలంటే శృతి కెరీర్ డౌన్ అయ్యింది. చేజేతులా శృతి కెరీర్ నాశనం చేసుకుంది. స్టార్ గా వెలిగిపోతున్న రోజుల్లో శృతి లవ్ ఎఫైర్ కారణంగా పరిశ్రమకు దూరం అయ్యారు. 2017 తర్వాత ఆమెకు గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో దర్శక నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆమెకు వేరే ఆప్షన్ లేదు. వచ్చిన ఆఫర్ చేసుకుంటూ పోవడమే. ఎన్టీఆర్, మహేష్, చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఆమెకు ఆఫర్ ఇచ్చే అవకాశం లేదు.

సలార్ మూవీలో ఆమెకు ఆఫర్ రావడం నిజంగా మిరాకిల్. ఏమాత్రం ఫార్మ్ లో లేని శ్రుతికి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. సలార్ ఎలాంటి ఫలితం అందుకున్నా శ్రుతికి ఆఫర్స్ కష్టమే. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు విజయం సాధిస్తే ఆమెకు తమ భవిష్యత్ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రియుడు శాంతను హజారికతో సహజీవనం చేస్తున్న శృతి ముంబైలోనే ఉంటున్నారు.