Homeఎంటర్టైన్మెంట్Shruti Haasan- Ravi Teja: శృతి హాసన్ హీరో రవితేజకు అలా వదిన అవుతుంది!

Shruti Haasan- Ravi Teja: శృతి హాసన్ హీరో రవితేజకు అలా వదిన అవుతుంది!

Shruti Haasan- Ravi Teja: టాలీవుడ్ లో రవితేజ-శృతి హాసన్ లది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి నటించిన బలుపు, క్రాక్ సూపర్ హిట్స్ కొట్టాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు గోపిచంద్ మలినేనినే. శృతి హాసన్ ఆయనకు హిట్ సెంటిమెంట్ కూడాను. అందుకే బాలయ్య సినిమాకు కూడా ఆమెనే కంటిన్యూ చేశాడు. గోపీచంద్ డైరెక్షన్ లో శృతి హాసన్ కి వీరసింహారెడ్డి హ్యాట్రిక్ మూవీ. ఇక క్రాక్ రవితేజ కెరీర్లో అతిపెద్ద హిట్. అంతకు మించి ఆయన్ని మరలా సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం. వరుస పరాజయాలతో రవితేజ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో క్రాక్ హిట్ పడింది.

Shruti Haasan- Ravi Teja
Shruti Haasan- Ravi Teja

క్రాక్ లో శృతి-రవితేజ కెమిస్ట్రీ మరోసారి వర్క్ అవుట్ అయ్యింది. శృతి ఆ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీయడం విశేషం. రవితేజకు ప్రేయసిగా, భార్యగా రెండు సినిమాలు చేసిన శృతి… అనుకోకుండా ఆయనకు వదిన అయ్యింది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతుంది. వాల్తేరు వీరయ్య మూవీలో శ్రుతి హాసన్ చిరంజీవితో జతకట్టారు. ఆ మూవీలో రవితేజ కీలక రోల్ చేస్తున్నారు. విక్రమ్ సాగర్ ఏసీపీ రోల్ లో రవితేజ అదరగొట్టనున్నాడు. ఆయన రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.

అలాగే వాల్తేరు వీరయ్య-విక్రమ్ సాగర్ వరసకు అన్నదమ్ములని, వారు సవతి తల్లుల పిల్లలు అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇద్దరి మధ్య సంఘర్షణ, ఇగో వార్ ఉంటుందనేది, టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ క్రమంలో చిరంజీవితో జతకట్టిన శృతి హాసన్ రవితేజకు వదిన అయ్యారన్న మాట. శృతి-రవితేజ కాంబినేషన్లో సీన్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ… ఈ విషయాన్ని టాలీవుడ్ వర్గాలు ప్రముఖంగా చర్చించుకుంటున్నాయి. ఇక రవితేజకు జంటగా కేథరిన్ నటిస్తున్నట్లు సమాచారం.

Shruti Haasan- Ravi Teja
Shruti Haasan- Ravi Teja

కాగా వాల్తేరు వీరయ్య మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. దేవిశ్రీ కసితో మూవీకి పని చేశాడు అనిపిస్తుంది. ఆయన ట్యూన్స్ ఆకట్టుకుంటున్నాయి. బాస్ పార్టీ సాంగ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీలో జనవరి 13న విడుదల చేస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి బరిలో అన్ని అస్త్రాలతో చిరంజీవి వాల్తేరు వీరయ్యగా దిగనున్నారు. వారసుడు, వీరసింహారెడ్డి చిత్రాలతో పోటీపడనున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version