Aamir Khan- NTR: పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక స్టార్ హీరోల సినిమాల్లో వివిధ పరిశ్రమలకు చెందిన నటులు భాగం అవుతున్నారు. ఇతర ఇండస్ట్రీలలో సినిమాకు ఆదరణ దక్కాలంటే ఇది తప్పనిసరి. ముఖ్యంగా నార్త్ మార్కెట్ మీద సౌత్ చిత్రాలు కన్నేస్తున్నాయి. అక్కడి ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకెళ్లాలంటే బాలీవుడ్ లో పేరున్న నటులను తీసుకోవడం ఉత్తమం. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రాలు గమనిస్తే దర్శకులు ఇదే టెక్నిక్ ఫాలో అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్ నటించారు. తక్కువ నిడివి గలిగిన ఒక కీలక రోల్ రాజమౌళి ఆయనకు సెట్ చేశారు.

ఇక కెజిఎఫ్ 2 లో కూడా బాలీవుడ్ స్టార్ భాగమయ్యారు. సంజయ్ దత్ మెయిన్ విలన్ గా చేశాడు. ప్రశాంత్ నీల్ ఎంపిక బాగా వర్క్ అవుట్ అయ్యింది. సంజయ్ దత్ ప్రధాన విలన్ గా చేయడం సినిమాకు మరింత హైప్ తెచ్చింది. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ సినిమా కోసం మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చిత్రం చేస్తున్నారు. ఈ ఏడాది సలార్ విడుదల కానుంది. సలార్ అనంతరం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ పట్టాలెక్కించాల్సి ఉంది.
ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన జరిగింది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఇటు టాలీవుడ్ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కీలక రోల్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. మరి అదే జరిగితే ఎన్టీఆర్ 31కి చాలా ప్లస్ అవుతుంది.

కాగా ఇటీవల అమీర్ ఖాన్ సినిమాలకు విరామం ప్రకటించారు. కొంత బ్రేక్ తర్వాత సినిమాలు చేస్తాను అన్నారు. ఆయన ఎన్నేళ్లు బ్రేక్ తీసుకుంటారు అనేది స్పష్టత లేదు. ఇక ఎన్టీఆర్ 30 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ఏడాది ఆయన నుండి ఒక్క మూవీ కూడా విడుదల కాదు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం నాలుగేళ్లు కేటాయించిన ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల మూవీకి మరో రెండేళ్ల సమయం ఇచ్చినట్లు అయ్యింది.