Shruti Haasan- Ravi Teja: టాలీవుడ్ లో రవితేజ-శృతి హాసన్ లది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి నటించిన బలుపు, క్రాక్ సూపర్ హిట్స్ కొట్టాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు గోపిచంద్ మలినేనినే. శృతి హాసన్ ఆయనకు హిట్ సెంటిమెంట్ కూడాను. అందుకే బాలయ్య సినిమాకు కూడా ఆమెనే కంటిన్యూ చేశాడు. గోపీచంద్ డైరెక్షన్ లో శృతి హాసన్ కి వీరసింహారెడ్డి హ్యాట్రిక్ మూవీ. ఇక క్రాక్ రవితేజ కెరీర్లో అతిపెద్ద హిట్. అంతకు మించి ఆయన్ని మరలా సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం. వరుస పరాజయాలతో రవితేజ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో క్రాక్ హిట్ పడింది.

క్రాక్ లో శృతి-రవితేజ కెమిస్ట్రీ మరోసారి వర్క్ అవుట్ అయ్యింది. శృతి ఆ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీయడం విశేషం. రవితేజకు ప్రేయసిగా, భార్యగా రెండు సినిమాలు చేసిన శృతి… అనుకోకుండా ఆయనకు వదిన అయ్యింది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతుంది. వాల్తేరు వీరయ్య మూవీలో శ్రుతి హాసన్ చిరంజీవితో జతకట్టారు. ఆ మూవీలో రవితేజ కీలక రోల్ చేస్తున్నారు. విక్రమ్ సాగర్ ఏసీపీ రోల్ లో రవితేజ అదరగొట్టనున్నాడు. ఆయన రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.
అలాగే వాల్తేరు వీరయ్య-విక్రమ్ సాగర్ వరసకు అన్నదమ్ములని, వారు సవతి తల్లుల పిల్లలు అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇద్దరి మధ్య సంఘర్షణ, ఇగో వార్ ఉంటుందనేది, టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ క్రమంలో చిరంజీవితో జతకట్టిన శృతి హాసన్ రవితేజకు వదిన అయ్యారన్న మాట. శృతి-రవితేజ కాంబినేషన్లో సీన్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ… ఈ విషయాన్ని టాలీవుడ్ వర్గాలు ప్రముఖంగా చర్చించుకుంటున్నాయి. ఇక రవితేజకు జంటగా కేథరిన్ నటిస్తున్నట్లు సమాచారం.

కాగా వాల్తేరు వీరయ్య మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. దేవిశ్రీ కసితో మూవీకి పని చేశాడు అనిపిస్తుంది. ఆయన ట్యూన్స్ ఆకట్టుకుంటున్నాయి. బాస్ పార్టీ సాంగ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీలో జనవరి 13న విడుదల చేస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి బరిలో అన్ని అస్త్రాలతో చిరంజీవి వాల్తేరు వీరయ్యగా దిగనున్నారు. వారసుడు, వీరసింహారెడ్డి చిత్రాలతో పోటీపడనున్నారు.