Shruti Haasan: స్టార్ కిడ్ శృతి హాసన్ చాలా ఇండిపెండెట్. నచ్చినట్లు బ్రతకడమే లైఫ్ అని నమ్ముతుంది. సాంప్రదాయాలు, సత్తు బండలు పట్టించుకోదు. ఏదైనా ఓపెన్ గానే చేస్తుంది. అరంగేట్రంతోనే బోల్డ్ రోల్స్ చేసి వార్తలకెక్కింది. డీడే మూవీలో పాకిస్థానీ వేశ్యగా శృతి చేసిన రోల్ మంట పుట్టించింది. ఆమె తెగింపుకు జనాలు ముక్కున వేలేసుకున్నారు. శృతి పై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చాలా ఉంది. ఆమె లైఫ్ స్టైల్ గమనిస్తే ఎవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. కాగా శృతి కెరీర్లో అనేక ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. వాటిలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుందాం.

హీరో సిద్దార్థ్ కి జంటగా అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాలు చేసిన శృతి అతనితో ఎఫైర్ నడిపారనే పుకార్లు ఉన్నాయి. అప్పట్లో సిద్ధార్థ్-శృతి ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనంతరం పెళ్ళైన హీరో ధనుష్ కి దగ్గరయ్యారని కోలీవుడ్ లో పుకారు లేచింది. ధనుష్-శృతి కాంబోలో ‘3’ మూవీ తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ కోసం జతకట్టిన ఈ జంట రిలేషన్ పెట్టుకున్నారన్న వాదనలు వినిపించాయి.
హీరో నాగ చైతన్యకు జంటగా శృతి ప్రేమమ్ మూవీ చేశారు. ఆ టైం లో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న పుకార్లు వినిపించాయి. 2016లో ప్రేమమ్ మూవీ విడుదలైంది. అలాగే ఓ యాడ్ షూట్ కోసం రన్బీర్ కపూర్-శృతి కలిశారు. ఆ సమయంలో శ్రుతిని ప్లే బాయ్ రన్బీర్ గిల్లాడనే న్యూస్ బాలీవుడ్ ని ఊపేసింది. ఈ వార్తలను శృతి సిల్లీ అంటూ కొట్టిపారేసింది. లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో అధికారికంగానే శృతి ఎఫైర్ నడిపారు. కొన్నాళ్లు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

శృతి-మైఖేల్ వివాహం చేసుకుంటారంటూ ప్రచారం జరిగింది. 2019లో అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం శృతి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో సహజీవనం చేస్తున్నారు. శృతి-శాంతను ముంబైలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. దాదాపు రెండేళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారు. అయితే హజారికతో రిలేషన్ లో ఉంటూనే దర్శకుడు గోపీచంద్ మలినేనికి శృతి దగ్గరయ్యారనే పుకార్లు వినిపించాయి. ఆమెకు వరుసగా ఆఫర్స్ ఇస్తున్న గోపీచంద్ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేదికపై ఐ లవ్ యూ చెప్పారు. అయితే ఈ రూమర్స్ ని గోపీచంద్ ఖండించారు.