
Shriya Saran: మిలీనియం ప్రారంభంలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ చిన్నది శ్రియ శరన్. ఈ కందిరీగ నడుము భామ 2001లో హీరోయిన్ గా మారారు. దర్శకుడు విక్రమ్ కుమార్ ‘ఇష్టం’ మూవీతో ఆమెను హీరోయిన్ చేశారు. ఆయనకు అది రెండో చిత్రం. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఇష్టం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక రెండో మూవీతోనే శ్రియ నాగార్జున వంటి టాప్ స్టార్ తో ఛాన్స్ దక్కించుకుంది. నాగ్-శ్రియ కాంబోలో తెరకెక్కిన సంతోషం సూపర్ హిట్ కొట్టింది.
మూడో చిత్రం చెన్నకేశవరెడ్డి, నాలుగో మూవీ నువ్వే నువ్వే హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అనతికాలంలో ఎదిగిన శ్రియ ప్రస్థానం ఏళ్ల తరబడి సాగింది. ఇంకా కొనసాగుతుంది. లాంగ్ కెరీర్ అనుభవించిన ఈ తరం హీరోయిన్స్ లో ఆమె ఒకరు. శ్రియ ప్రొఫెషనల్ డాన్సర్. చక్కని రూపం, నటన ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. రెండు తరాల టాప్ హీరోలను కవర్ చేసిన ఘనత ఆమెది.

స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయ్యాక శ్రియ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రుతో 2018లో నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల మధ్య శ్రియ పెళ్లి జరిగింది. వీరికి ఒక పాప. కూతురు పేరు రాధ. ఈ విషయాన్ని శ్రియ రహస్యంగా ఉంచారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ గర్భం దాల్చడం, ఆడపిల్లను కనడం జరిగిపోయాయి. తర్వాత తాపీగా అభిమానులతో ఈ విషయం షేర్ చేసింది. దాంతో అందరూ షాక్ తిన్నారు.
కొన్ని రకాల విమర్శలకు భయపడి గర్భం దాల్చిన విషయం దాచానంటూ శ్రియ ఇటీవల వివరణ ఇచ్చారు. శ్రియ నటించిన హిందీ చిత్రం దృశ్యం 2 హిట్ టాక్ తెచ్చుకుంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళ చిత్ర రీమేక్. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ కబ్జా విడుదలకు సిద్ధమైంది. ఉపేంద్ర,కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ హీరోలుగా నటించారు. కబ్జా మూవీపై అంచనాలు ఉన్నాయి.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా శ్రియ సెగలు పుట్టిస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా శరీరం మొత్తం కనిపించేలా ట్రాన్స్పరెంట్ ట్రెండీ వేర్ ధరించి చెమటలు పట్టించారు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం శ్రియ చేసిన ఈ బోల్డ్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. శ్రియ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.