
Venkatesh- Shraddha: విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైంధవ్. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ చిత్ర హీరోయిన్ పై అధికారిక ప్రకటన చేశారు. సైంధవ్ చిత్రంలో వెంకీకి జంటగా శ్రద్దా శ్రీనాథ్ ని ఎంపిక చేశారు. కొన్నాళ్లుగా శ్రద్దా పేరు వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్న వార్తే నిజమైంది. శ్రద్దా జెర్సీ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ సూపర్ హిట్ కాగా… టాలీవుడ్ ఆడియన్స్ మదిలో రిజిస్టర్ అయ్యారు. తర్వాత ఆది సాయి కుమార్ తో ‘జోడి’, సిద్దు జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రాల్లో నటించారు.
కొంచెం గ్యాప్ ఇచ్చి సైంధవ్ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక సైంధవ్ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానుంది. సైంధవ్ ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ మధ్య వెంకటేష్ అన్నీ మల్టీస్టారర్స్ చేస్తున్నారు. అలాగే వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. దృశ్యం 2, నారప్ప చిత్రాల్లో ఆయన పెళ్ళీడుకు వచ్చిన పిల్లల తండ్రిగా కనిపించారు.

వెంకీ నుండి ఒకప్పటి యాక్షన్ ఎంటర్టైనర్స్ ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఆ కోరిక సైంధవ్ తీర్చనుంది. ఈ మూవీలో వెంకీ తన యాక్షన్ అవతార్ బయటకు తీయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ దీనిపై హింట్ ఇచ్చేసింది. చేతిలో గన్ తో వెంకీ సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్ అంచనాలు పెంచేస్తుంది.
ఇది మెడికల్ మాఫియా మీద హీరో చేసే యుద్ధం అని ప్రచారం అవుతుంది. అలాగే ‘హిట్’ యూనివర్స్ లో భాగం కూడా కావచ్చని అంటున్నారు. దర్శకుడు శైలేష్ కొలను హిట్ 1 అండ్ హిట్ 2 చిత్రాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవి. మూడో భాగం హీరో నానిని ప్రకటించారు. హిట్ 2 క్లైమాక్స్ లో హీరో నాని లుక్ రివీల్ చేశారు. ఈ క్రమంలో సైంధవ్ ఆ చిత్రాలతో ముడిపడి ఉండే అవకాశం కలదంటున్నారు. డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా సైంధవ్ విడుదల కానుంది.
One of the most talented actresses we have in the country. Always wanted to work with her.
Team #SAINDHAV welcomes aboard @ShraddhaSrinath as 'MANOGNYA' ❤️🔥@VenkyMama @Nawazuddin_S @maniDop @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt @Garrybh88 @NeerajaKona pic.twitter.com/jMoHJJuNBm
— Sailesh Kolanu (@KolanuSailesh) April 15, 2023