Shocking To YouTbe Fans: అభిమానులకు షాకిస్తున్న యూ ట్యూబ్

YouTube shocking fans: సామాజిక మాధ్యమాలకు ఎంతటి ప్రాధాన్యం ఏర్పడిందో తెలుసు. ప్రస్తుతం యూట్యూబ్ ను వాడని ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా మనుషులతో బంధం పెనవేసుకుపోవడంతో అది లేకుంటే ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకోవాలని చూడటం కామనే. మనం టీవీల్లో వచ్చే కార్యక్రమాల్లో మాత్రమే యాడ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మధ్యలో యాడ్స్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో కొందరికి విసుగు పుట్టినా మరికొందరు సర్దుకుపోతున్నారు. విసుగొచ్చిన వారు […]

Written By: Srinivas, Updated On : September 14, 2022 2:46 pm
Follow us on

YouTube shocking fans: సామాజిక మాధ్యమాలకు ఎంతటి ప్రాధాన్యం ఏర్పడిందో తెలుసు. ప్రస్తుతం యూట్యూబ్ ను వాడని ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా మనుషులతో బంధం పెనవేసుకుపోవడంతో అది లేకుంటే ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకోవాలని చూడటం కామనే. మనం టీవీల్లో వచ్చే కార్యక్రమాల్లో మాత్రమే యాడ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మధ్యలో యాడ్స్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో కొందరికి విసుగు పుట్టినా మరికొందరు సర్దుకుపోతున్నారు. విసుగొచ్చిన వారు డబ్బులు పే చేసి మరీ అవి రాకుండా చేసుకుంటున్నారు. ఇక వాటికి ఎందుకు డబ్బులు దండగ అనుకునే వారు వాటిని కూడా చూస్తున్నారు.

YouTube shocking fans

ఇటీవల ఓ కొత్త ప్లాన్ ఆలోచిస్తన్నట్లు తెలుస్తోంది. కార్యక్రమాల మధ్యలో కనీసం ఓ ఐదు యాడ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో వినియోగదారులకు బోరు కొట్టించేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. యాడ్స్ వద్దనుకుంటే వాటికి డబ్బులు చెల్లిస్తేనే అవి వచ్చే అవకాశం ఉండదు. దీంతో యాడ్స్ రాకుండా ఉండేందుకు కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురయ్యే సూచనలున్నాయి. రాబోయే రోజుల్లో ఏది ఫ్రీగా రాదని చెప్పేందుకు సంకేతంగానే ఈ విధంగా చేస్తున్నట్లు భావిస్తున్నారు.

వీడియోలు చూస్తున్నంత సేపు యాడ్స్ చూస్తూ వెయిట్ చేయడం నరకమే. దీన్ని ఆయా సంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. దీంతో విసిగిపోయేవారు ఎందుకు ఈ బాధంతా డబ్బు చెల్లిస్తే పోలా అని ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ప్లాన్ కార్యరూపం దాలిస్తే ఇక వినియోగదారులకు చుక్కలే. టీవీల్లో యాడ్స్ గొడవ ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది మొబైళ్లలో చూస్తున్నారు. దీన్ని గమనించిన యాజమాన్యం వారితో కూడా వ్యాపారం చేయాలని చూస్తోంది.

యూట్యూబ్ లో స్కిప్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కితే యాడ్స్ పోయేవి. కానీ ప్రస్తుతం స్కిప్ ఆప్షన్ ను కూడా ఉంచడం లేదు. దీంతో కచ్చితంగా డబ్బులు కట్టకపోతే యాడ్స్ చూడాల్సిందే. యూట్యూబ్ చేస్తున్న కొత్త పథకంతో వినియోగదారులు డబ్బులు చెల్లించే విధంగా వారిని రెడీ చేసే భాగంలోనే ఇలా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. యూట్యూబ్ తన వ్యాపార ధోరణితోనే ఇలా యాడ్స్ ను తీసుకొస్తున్నట్లు కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ యాజమాన్యం తీసుకునే నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే. ఇకపై వీడియోలు చూసేవారు కొంత మొత్తం చెల్లించాల్సిందే అని తెలుస్తోంది.

Tags