https://oktelugu.com/

Renu Desai : షాకిస్తున్న పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ లేటెస్ట్ లుక్? ఆందోళనలో ఫ్యాన్స్!

Pawan Kalyan’s ex-wife Renu Desai : నటి రేణు దేశాయ్ హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. ఆమె ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుతో ఫోటోలు దిగేందుకు యువత ఆసక్తి చూపారు. జూబ్లీహిల్స్ లో గల నవోదయ రెస్టారెంట్ లో ఫేస్ టు ఫేస్ పేరుతో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిర్వాహకులు ఫేస్ టు ఫేస్ ఈవెంట్లో పాల్గొనాల్సిందిగా రేణు దేశాయ్ ని రిక్వెస్ట్ చేశారు. వారి ఆహ్వానాన్ని మన్నించి రేణు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2023 / 09:45 PM IST
    Follow us on

    Pawan Kalyan’s ex-wife Renu Desai : నటి రేణు దేశాయ్ హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. ఆమె ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేణుతో ఫోటోలు దిగేందుకు యువత ఆసక్తి చూపారు. జూబ్లీహిల్స్ లో గల నవోదయ రెస్టారెంట్ లో ఫేస్ టు ఫేస్ పేరుతో చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిర్వాహకులు ఫేస్ టు ఫేస్ ఈవెంట్లో పాల్గొనాల్సిందిగా రేణు దేశాయ్ ని రిక్వెస్ట్ చేశారు. వారి ఆహ్వానాన్ని మన్నించి రేణు దేశాయ్ ఫేస్ టు ఫేస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు. తన విలువైన సలహాలు ఇచ్చారు. విశ్లేషణ చేశారు.

    కాగా రేణు దేశాయ్ లేటెస్ట్ లుక్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. చందమామలా నాజూగ్గా ఉండే రేణు ఇలా అయిపోయారేంటని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు కారణాలు ఏంటని విశ్లేషిస్తున్నారు. ఆ మధ్య తనకు ఓ రేర్ డిసీజ్ ఉందని రేణు చెప్పారు. అలాగే ఆమె వయసు నాలుగు పదులు దాటిన నేపథ్యంలో మునుపటి గ్లామర్ కోల్పోయారు.కొంచెం లావయ్యారు. రేణు దేశాయ్ కొన్నాళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. గతంలో ఆమె పూణేలో ఉండేవారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో హైదరాబాద్ వచ్చారు. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు కూడాను.

    రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ నటిస్తున్నారు. ఆమె ఓ కీలక రోల్ చేస్తున్నారు. రెండు దశాబ్దాల అనంతరం రేణు దేశాయ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనున్నారు. గత ఏడాది రేణు దేశాయ్ లుక్ రివీల్ చేశారు. ఆమె తెల్లబట్టలో చాలా భిన్నమైన లుక్ లో దర్శనమిచ్చారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దసరా కానుకగా విడుదల కానుంది.

    ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ పోస్ట్స్ ఆసక్తిరేపుతుంటాయి. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కామెంట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అలాగే చర్చకు దారి తీసింది. కొందరు జీవితంలోకి హఠాత్తుగా వచ్చి వెళ్ళిపోతారు. వారితో గడిపింది కొన్ని గంటలే అయినా మనసులో చెరగని ముద్ర వేస్తారు. కొందరి ఎడబాటు తట్టుకోవడం కష్టం. కొందరు మాత్రం సంతోషాలు నింపి దూరమవుతారు… అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ఇక రేణు దేశాయ్ కొడుకు అకీరా నందన్ టీనేజ్ దాటేశాడు. కూతురు ఆద్య మల్టీ టాలెంటెడ్ అని రేణు చెబుతుంటారు.