Homeఅంతర్జాతీయంKim Jong Un: కిమ్ సుఖం కోసం ఏడాదికి 25 మంది కన్యత్వ యువతులు.. వెలుగులోకి...

Kim Jong Un: కిమ్ సుఖం కోసం ఏడాదికి 25 మంది కన్యత్వ యువతులు.. వెలుగులోకి దారుణ నిజం

Kim Jong Un: ఉత్తరకొరియా.. తరచూ సంచలనాలతో వార్తల్లో నిలుస్తుంది. ఆ దేశంతోపాటు, అధ‍్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి సంచలన విషయాలు అంతర్జాతీయ మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి. తాజాగా కిమ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరూ ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనను ‘సంతోష పెట్టడానికి’ ఏటా 25 మంది యువతుల బృందం పనిచేస్తుందట. వీరి ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా చేస్తారట. విధేయత ఆధారంగా వీరిని ఎంపిక చేసుకొని.. వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని సమాచారం. కిమ్‌ను ‘సంతోష పెట్టే’ బృందంగా పేర్కొనే ఈ పనికి గతంలో ఎంపికైన, ఉత్తర కొరియా నుంచి పారిపోయిన ఓ యువతి చెప్పిన విషయాలను ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

వైద్య పరీక్షలు తప్పనిసరి..
కిమ్‌ను సంతోషపెట్టే టీం సభ్యుల కోసం యవ్వన దశలో ఉన్న అందమైన అమ్మాయిల కోసం ఆయన సన్నిహితులు దేశ వ్యాప్తంగా పర్యటిస్తారు. కొంతమందిని ఎంపిక చేసిన తర్వాత వారి కుటుంబం, రాజకీయ నేపథ్యం గురించి ఆరాతీస్తారు. ఉత్తర కొరియా నుంచి పారిపోయిన లేక దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో బంధువులు ఉన్న వారిని పక్కన పెడతారు. 25 మందిపి ఎంపిక చేసిన తర్వాత.. వారికి కన్యత్వ పరీక్షలు చేస్తారు. చిన్న మచ్చ ఉన్నా అనర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం వారిని ప్యాంగ్యాంగ్‌కు పంపిస్తారు. నియంతను అన్ని విధాలుగా సుఖ పెట్టడమే వారి పని.

మూడు బృందాలుగా విభజించి..
ఎంపిక చేసిన 25 మంది యువతుల బృందాన్ని మూడు విభాగాలుగా విభజిస్తారు. కిమ్‌కు మసాజ్‌ చేయడానికి ఒక బృందం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడానికి ఇంకో బృందానికి శిక్షణ ఇస్తారు. మూడో గ్రూపు లైంగిక కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. నియంతతో సన్నిహితంగా ఉండడమే వారి విధి. పురుషులను ఎలా సంతోషపెట్టాలో నేర్చుకుంటారు. అత్యంత అందమైన అమ్మాయిలను మాత్రమే కిమ్ తన దగ్గరకు పిలుచుకుంటారు. యువతలు వయసు 20 ఏళ్లు వచ్చే వరకు ఆ బృందంలోనే ఉంచుకుని, ఆ తర్వాత కిమ్ అంగరక్షకులతో వారికి పెళ్లి చేస్తారని తెలిపింది.

కుటుంబ సభ్యుల అంగీకారం..
ఇదిలా ఉంటే.. కిమ్‌ బృందంలో యువతులు పనిచేయడానికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారట. తమ పిల్లలు ఆకలితో అలమటించకుండా ఉంటారనే ఉద్దేశంతో కిమ్‌ బృందానికి సెలక్ట్‌ కావాలని కోరుకుంటారట. అయితే, ఈ సంస్కృతి కేవలం కిమ్ హయాంలోనే ఇది మొదలు కాలేదు. 1970 నుంచే ఈ బృందం అక్కడ పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version