https://oktelugu.com/

US Student Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు వీసా స్లాట్లు.. జారీ ఎప్పుడంటే!

అమెరికా భారత్‌ మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా భారత విద్యార్థులకు అగ్రరాజ్యాం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. 2023లో రికార్డు స్థాయిలో 11 లక్షల ఇమ్మిగ్రెంట్‌ వీసాలు భారతీయులకు జారీ చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 3, 2024 / 08:57 AM IST

    US Student Visa

    Follow us on

    US Student Visa: విదేశీ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న భారతీయ విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త చెప్పింది. విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దశలవారీగా వీటిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. మే నెల రెండో వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు ఈ స్లాట్లు అందుబాటులో ఉంచేలా కరసత్తు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. ఈసారి కూడా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, చెనై్న, ముంబయి కాన్సులేట్‌ కార్యాలయాల్లో విద్యార్థులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

    భారత్‌కు ప్రాధాన్యం..
    అమెరికా భారత్‌ మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా భారత విద్యార్థులకు అగ్రరాజ్యాం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. 2023లో రికార్డు స్థాయిలో 11 లక్షల ఇమ్మిగ్రెంట్‌ వీసాలు భారతీయులకు జారీ చేసింది. 3జ75 లక్షల మంది పిటిషన్‌ ధారిత తాత్కాలిక ఉపాధి వీసాలను (హెచ్‌1బీ) కూడా జారీ చేసింది. భారతీయుల నుంచి వీసాలకు డిమాండ్‌ ఉంటుంది. దీనిని అధిగమించేందుకు హైదరాబాద్‌లో 300 మిలియన్‌ డాలర్ల వ్యయంతో నూతన కార్యాలయం కూడా ఏర్పాటు చేసింది.

    స్టెమ్‌ కోర్సులపై ఆసక్తి..
    ఇక భారతీయ విద్యార్థులు అమెరికాలో స్టెమ్‌ కోర్సులతోపాటు వినూత్న కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్, మెకానికల్, మైక్రో ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటర్‌ కోర్సులు ఏఐ రోబోటిక్స్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇపుపడిప్పుడే సైకాలజీ సబ్జెక్టు చదివేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అమెరికా – భారతీయ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న డ్యూయల్‌ డిగ్రీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2022–23 గణాంకాల ప్రకారం అమెరికాలో ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)కు సంబంధించి 69,062 మంది విద్యార్థులతో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. వరుసగా మూడో ఏడాది కూడా ప్రపంచంలోని ఇతర దేశౠలతో పోలిస్తే భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారు. ఇక అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య తాజాగా 2,65,923 కు చేరింది. ఇది ఆల్‌టైం రికార్డు అమెరికా ప్రకటించింది. అమెరికాలో చదువుకుంటున్న ప్రతీ మిలియన్‌ విదేశీ విద్యార్థుల్లో 25 శాతం భారతీయులే. 2023లో గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంంఖ్య 63 శాతం పెరిగింది. అండర్‌ గ్రాడ్యుయేట్స్‌ 16 శాతం పెరిగారు.

    వెబ్‌సైట్‌ సిద్ధం..
    ఇక తరచుగా వస్తున వెబ్‌సైట్‌ ఇబ్బందులను కూడా అధికారులు చర్కదిద్దారు. వీసా స్లాట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌ను 2023 జూలైలో ఆధునికీకరించారు. సాంకేతిక లోపాలను తగ్గించేందుకు నూతన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇంకా ఏమైనా సమస్యలు ఎదురైతే సహాయం కోసం support-india@ustravelsdocs.com ను సంప్రదించవచ్చు.