
CM KCR- Errabelli Dayakar Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సాధారణంగానే నోటిదురుసు ఎక్కువ. తాను ఒక రాజులా మిగతావారంతా తన బానిసల్లా ఫీలవుతూ ఉంటారు. ఎదుటి వారిని కేసీఆర్ పెద్దగా గౌరవం ఇవ్వరు, అది గవర్నర్ అయినా, ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా తనకంటే తక్కువే అన్న భావనతో ఉంటారు. వాడు వీడు అని సంబోధిస్తుంటారు. ఇక తన కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలనైతే బానిసలుగా చూస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత వరకు ప్రగతి భవన్‌లో అడుగు పెట్టని ఎమ్మెల్యేలు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఇక ప్రజల సంగతి తెలిసిందే బేవకూఫ్, ముండా, రండా, దొంగలు, లుచ్చాలు లాంటి పదాలు సర్వసాధారణం. అయితే తాజాగా ఓ నిండు సభలో మంత్రి ఎర్రబెల్లిని కొట్టడమే కాకుండా దున్నపోతా అంటూ దుర్భాషలాడడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సదరు మంత్రివర్యులు కూడా ముఖ్యమంత్రి కమ్యూనిటీ కావడంతో రచ్చ కావడం లేదు.
నిండు సభలో ఎంత మాటన్నాడు..
ఇటీవల రాష్ట్రంలో కురిసిన వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన్నాయి. రైతులు పంటలు నష్టపోయి ఆందోళన చెందుతున్నారు. గతంలో రైతులు ఎంత ఇబ్బంది పడినా పట్టించుకోని కేసీఆర్, ఎన్నికల ఏడాది కావడంతో రైతుల పరామర్శ యాత్రకు బయల్దేరారు. ఉమ్మడి వరంగల్, కరీంగనగర్, నిజామాబాద్ జిలాల్లో రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. అయితే మైక్ సౌండ్ చిన్నగా ఉండడంతో అసహనానికి లోనైన కేసీఆర్ పక్కనే ఉన్న మంత్రి ఎర్రబెల్లి భుజంపై గట్టిగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. మైక్ తన చేతిలో ఉన్నదన్న విషయం మర్చిపోయి.. ‘సౌండ్ పెంచమని చెప్పు దున్నపోతా’ అని తిట్టారు. ఈ విషయం మైక్‌లో అందరికీ వినపడింది.

రాష్ట్రవ్యాప్తంగా చర్చ..
రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్, తన మంత్రివర్గ సహచరుడిని భుజంపై కొట్టడమే కాకుండా, దుర్భాషలాడడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సభలో ఆ దృశ్యాలను వీడియో దీసిన కొంతమంది కేసీఆర్ చేష్టలు, మాటలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. సీఎం హోదాలో ఉండి ఆయన ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. దయాకర్‌రావు కూడా కేసీఆర్ కమ్యూనిటీ వ్యక్తి కావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇతర సామాజిక వర్గాలవారైతే ఇప్పటికే రాష్ట్రం రచ్చరచ్చ అయ్యేదని పలువురు పేర్కొంటున్నారు.