
Keerthy Suresh- Anchor Suma: తెలంగాణ అంటేనే అలాగ్ ఉంటది.. మేం దిల్దార్‌గ ఉంటం.. స్నేహం కోసం ప్రాణమిస్తం.. కొట్లాకొస్తే ప్రాణం తీస్తం’ ఇలా ఉంటుంది తెలంగాణ భాష, యాస. భాష ఘాటుగా ఉన్నా భావంలో మాత్రం ప్రేమ, ఆప్యాయతే ఉంటుంది. ఈ విషయం తెలంగాణ వచ్చాక చాలా మంది అంగీకరిస్తున్నారు. గతంలో తెలంగాణ భాషను విలన్లకే పెట్టిన దర్శక నిర్మాతలు, ఇప్పుడు హీరోలు, హీరోయిన్లతో కూడా తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పిస్తున్నారు. సినిమాలు తీస్తున్నారు. ఇదే తెలంగాణ భాషకు దక్కుతున్న గౌరవం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ కూడా తెలంగాణ భాష గొప్పతనాన్ని తనదైన శైలిలో చెప్పారు. ఆ ఘాటును ఎలా జీర్ణించుకున్నారని హీరోయిన్ కీర్తిసురేష్‌ను అడిగారు. అందుకు ఘాటంటే నాకు ఇష్టం అని సమాధానం ఇచ్చారు కీర్తి.
తెలంగాణ భాషకు ఘాటెక్కువ…
దసరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ సినిమాలోని హీరో నాని, హీరోయిన్ కీర్తిసురేష్ ఇంటర్వ్య చేశారు. ఈ సినిమా మొత్తం తెలంగాణ యాస, సింగరేణి ప్రాంత నేపథ్యంలో సాగే కథలాగే అనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు తెలంగాణ నేపథ్యంలో కూడినవే. ఇక చమ్కీల అంగీలేసి.. అనే పాట అయితే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. దీంతో యాంకర్ సుమ సినిమాలో తెలంగాణ భాష మాట్లాడడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా అని నేరుగా ప్రశ్నించకుండా తెలంగాణ యాసకు ఘాటెక్కువ కదా.. దానిని నేర్చుకోవడానికి కష్టపడ్డారా అని ప్రశ్నించారు. అంతే భిన్నంగా కిర్తి సురేష్ సమాధానం చెప్పింది. తనకు ఘాటంటే ఇష్టమని, దానిని ఆస్వాదిస్తానని, అంతే సులభంగా తెలంగాణ యస నేర్చుకున్నానని చెప్పారు.

గుజరాత్ నుంచి రాలేదు కదా..
తెలంగాణ యాస నేర్చుకోవడానికి పెద్దగా కష్టపడలేదని కీర్తి సరేష్ కుండ బద్దలు కొట్టారు. అంతటితో ఆగకుండా తెలంగాణ యాసను కష్టంగా భావించడానికి నేనేమైనా గుజరాత్ నుంచి వచ్చానా అంటూ తిరిగి ప్రశ్నించారు. కీర్తి సమాధానంతో యాంకర్ సుమ షాక్ అయ్యారు. నా కళ్లు తెరిపించారు. ఈ విడియో చూసనవాళ్లు మీకు బొట్టుపెట్టి తంబ్‌నెయిల్ వేస్తారు అంటూ పొగిడేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మొత్తానికి తెలంగాణ భాషకు లభిస్తున్న గుర్తింపు, గౌరవానికి ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వంగా ఫీల్ అవుతోంది.. అట్లుంటది మరి తెలంగాణ భాష.. యాస!