
Car Prices Hike: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు వచ్చి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. విదేశీ కంపెనికి చెందిన ఎన్నో బ్రాండ్లు వచ్చినా మారుతి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మారుతి నుంచి వ్యాగన్ఆర్ మోడల్ ఆకట్టుకుంటోంది. ఆకర్షించే మోడళ్లను తీసుకొచ్చే మారుతి సామాన్యులకు అందుబాటు ధరల్లో అందిస్తుంది. అయితే ఈ మార్చి 31 తరువాత మారుతి కంపెనీ కార్ల ధరలు పెరగనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలతో కార్లను విక్రయిస్తున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. వాటి వివరాలేంటో చూద్దాం.
మారుతి సుజుకి ఈ ఏడాది జనవరిలో 1.1 శాతం ధరలను పెంచింది. అయితే అంతకుముందే హోండా, హీరో మోటో కార్స్ కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇన్ ఫుట్ కాస్ట్ వ్యయం పెరిగిపోవడంతో అప్పుడు ధరలు పెంచినట్లు తెలిపింది. ఇప్పుడు ద్రవ్యోల్భణంతో పాటు రెగ్యులరేటరీ నియంత్రణలు పాటించాల్సి రావడంతో కార్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.

కారు మోడల్ ను భట్టి ధరల్లో తేడాలుంటాయని యాజమాన్యం పేర్కొంది. మారుతి నుంచి ఆల్టో, ఈకో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఎర్టీగా, బ్రెజ్జా, గ్రాండ్ విటారా వంటి అత్యుత్తమ కార్లు బయటకు వచ్చాయి. వీటిలో దాదాపు అన్ని మోడళ్లను వాహన ప్రియులు ఆదరించారు. ప్రస్తుతం గ్రాండ్ విటారా, వ్యాగన్ఆర్ నుంచి లేటేస్ట్ మోడల్స్ బయటకు రానున్నాయి. కొందరు వ్యాగన్ ఆర్ కోసం ముందే బుక్ చేసుకున్నారు. అయితే మార్చి 31లోపు కొనుగోలు చేసేవారికి పాత ధరలే ఉంటాయని తెలిపింది. దీంతో కారు కొనాలనుకునేవారు మారుతి బ్రాండ్ల కోసం వెతుకుతున్నారు.
రిలయ్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా అన్ని వాహనాల ధరలు పెరుగుతాయని తెలిపింది. అయితే లేటేస్ట్ మోడల్ కోసం ఎదురుచూస్తున్నవారు ధరల పెరుగుదల నేపథ్యంలో ముందే బుక్ చేసుకుంటున్నారు. ఇక టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్ ధరలు 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు బీఎస్-6, ఫేస్ -2 దశ కర్బన ఉద్గారాల నిబంధనలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో కార్ల ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.