
Nani Dasara: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘దసరా’ నేడు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీ రిలీజ్ కి ముందు నుండే ఈ సినిమాకి భారీ హైప్ ఉండేది, ఆ హైప్ ని ఈ చిత్రం మ్యాచ్ చెయ్యడం లో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యింది. ఓపెనింగ్స్ కూడా స్టార్ హీరో రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.
ఈ సినిమాకి ఈ రేంజ్ టాక్ రావడానికి ప్రధాన కారణం న్యాచురల్ స్టార్ నాని అద్భుతమైన యాక్టింగ్ అని చెప్పడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ చిత్రం లోని ప్లస్ లు మరియు మైనస్ లు ఒకసారి పరిశీలిస్తే, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కి ఇది తొలి చిత్రం అంటే ఎవ్వరూ నమ్మరు. కొన్ని సన్నివేశాలు ఆయన తీసినట్టు రాజమౌళి లాంటి దర్శకులు కూడా తియ్యలేదు.

ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో నాని స్నేహితుడు సూరి తలని నరికే షాట్ ని చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. థియేటర్ మొత్తం నోరెళ్ళబెట్టి చూసిన సన్నివేశం ఇది, అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ అర్థం కాదు.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈ ఐకానిక్ షాట్ చరిత్రలో మిగిలిపోతాది. డైరెక్టర్ టేకింగ్ సినిమా మొత్తం ఇదే విధంగా ఉంటుంది, క్లైమాక్స్ సన్నివేశం కూడా ఆడియన్స్ రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో ఉంటుంది. ఫైట్ సీన్స్ అన్నీ తెరపై అద్భుతంగా వచ్చాయి.టేకింగ్ బాగుంది కానీ , డైరెక్టర్ బలమైన కథ రాసుకొని ఉండుంటే ఈ చిత్రం మరో లెవెల్ కి వెళ్లి ఉండేది అనిపించింది.
కేవలం టేకింగ్ మీదనే చిత్రాన్ని నెట్టుకొచ్చాడు కానీ, కథ మీద అంత ద్రుష్టి పెట్టలేదు. కానీ ఈ కథని ఎలాంటి అనుభవం లేకుండా బోర్ కొట్టకుండా తీసాడంటే డైరెక్టర్ లో మంచి టాలెంట్ ఉందనే విషయం అర్థం అవుతుంది. మొత్తం మీద టాలీవుడ్ నుండి మరో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది, నాని కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలు రాయిగా నిలిచిపోతుందనే చెప్పాలి.