
Pooja Hegde: వరుసగా ఆరో ప్లాప్ ఇచ్చింది పూజా హెగ్డే. దీంతో ఆమె కెరీర్ కి తెరపడిందన్న వార్తలు వస్తున్నాయి. ఏడాది కాలంగా పూజాకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఆమె బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ ఇమేజ్ తో పూజా వరుస విజయాలు అందించారు. రాధే శ్యామ్ తో పట్టిన శని ఇంకా వదల్లేదు. పూజా హెగ్డే నటించిన చివరి హిట్ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. అనంతరం ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ చేశారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా విడుదలైన రాధే శ్యామ్ డిజాస్టర్ అయ్యింది. కోట్లలో నష్టాలు మిగిల్చింది.
అనంతరం ఆచార్య మరో ఎపిక్ డిజాస్టర్. చిరంజీవి-రామ్ చరణ్ ల ఈ మల్టీస్టారర్ లో పూజా హెగ్డే నీలాంబరి పాత్ర చేశారు. తర్వాత విజయ్ బీస్ట్, రణ్వీర్ సింగ్ సర్కస్ ప్లాప్ ఖాతాలో చేరాయి. రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కర్ ఈ దశాబ్దపు చెత్త మూవీగా ప్రేక్షకులు అభివర్ణించారు. ఎఫ్3 మూవీలో ఐటెం నంబర్ చేసి దిల్ రాజుకు ఝలక్ ఇచ్చింది. ఆ విధంగా ఐదు ప్లాప్స్ పూజా ఖాతాలో చేరాయి.
అందుకే లేటెస్ట్ రిలీజ్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ కోసం బాగా కష్టపడింది. విపరీతంగా సినిమాను ప్రమోట్ చేసింది. మనం ఎంత కష్టపడ్డా మూవీలో మేటర్ లేకపోతే ఎవరూ కాపాడలేరు. ఏప్రిల్ 21న విడుదలైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. మొదటి షో నుండి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పండగ వేళ కూడా సరైన ఓపెనింగ్స్ దక్కలేదు. ఈ క్రమంలో కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పూజాకు నిరాశ మిగల్చడం ఖాయమంటున్నారు.

ఈ పరిణామం ఆమె కెరీర్ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. హరీష్ శంకర్ మూవీలో పవన్ కి జంటగా పూజా హెగ్డేను అనుకున్నారు. తర్వాత మనసు మార్చుకొని శ్రీలీలను తీసుకున్నారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పరాజయంతో దర్శక నిర్మాతలు భయపడే ప్రమాదం ఉంది. ఫైనల్ గా ఆమె ఆశలన్నీ ఎస్ఎస్ఎంబి 28 పైనే. దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేష్ ఆమెకు హిట్ ఇచ్చి కెరీర్ చక్కబెట్టాల్సి ఉంది.