
Dasara Closing Collections: న్యాచురల్ స్టార్ నాని ఊర మాస్ అవతారం లోకి దిగి చేసిన ‘దసరా’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.గత కొంతకాలం గా సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాని, ఈ చిత్రం తో ఏకంగా కుంభస్థలమే బద్దలు కొట్టాడు.అయితే ఈ సినిమా ఎక్కువగా తెలంగాణ నేటివిటీ కి తగ్గట్టుగానే తియ్యడం తో, అక్కడి బాష అర్థం అర్థం కాక ఆంధ్ర లో యావరేజి ఫలితాన్ని మాత్రమే చూసింది.
కానీ తెలంగాణ లో మాత్రం కళ్ళు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి.ఆ స్థాయి వసూళ్లు ఇప్పటికీ చాలా మంది స్టార్ హీరోలకు రాలేదు.కేవలం తెలంగాణ లో మాత్రమే కాకుండా కర్ణాటక మరియు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.కొత్త సినిమాల రాకతో అన్నీ ప్రాంతాలలో క్లోసింగ్ కి దగ్గరగా వచ్చేసిన ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎంత రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతం లో 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఫుల్ రన్ లో 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అంటే పెట్టిన డబ్బులకు రెండింతలు ఎక్కువ రాబట్టింది అన్నమాట.ఈ మధ్య కాలం లో బలగం మరియు వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత బయ్యర్స్ కి ఆ రేంజ్ లాభాలను కలిగించిన సినిమా ఇదే.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర మరియు రాయలసీమ కలిపి కేవలం 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఇది యావరేజి వసూళ్లు అని చెప్పొచ్చు, కానీ ఓవర్సీస్ లో ఈ సినిమా దాదాపుగా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది, అలాగే కర్ణాటక లో కూడా 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది, మొత్తం మీద అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 64 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.