Shinjita Mustafa Case: సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటోంది. సమాజంలో వేగంగా గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది రీల్స్ చేస్తూ పోస్టు చేస్తున్నారు. కొందరు నిషేధి ప్రదేశాల్లో రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ పిచ్చి కారణంగా మంచికన్నా చెడే ఎఉ్కవగా జరగుతోంది. ఇందుకు తాజాగా కేరళలో జరిగిన ఘటనే ఉదాహరణ.
అభస్యకరంగా టచ్ చేశాడని రీల్..
కేరళ గోవిందపురంలో షింజితా ముస్తఫా అనే యువతి జనవరి 16న బస్సు ప్రయాణంలో యువకుడు అసభ్యంగా తాకాడని వీడియో పోస్టు చేసింది. ఇది వేగంగా వైరల్ అయి, దీపక్ అనే యువకుడిని లక్ష్యంగా చేసుకుంది. మనస్తాపంతో 18న ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీస్ చర్య..
పోలీసులు దర్యాప్తు చేసి ఆరోపణ తప్పుగా ఉందని నిర్ధారించి షింజితాను అరెస్టు చేశారు. ఆమె రీల్స్‌తో ఫేమస్ అయినా, ఈ ఘటన పరిణామాలు ఆమెకు భారీ శిక్షగా మారాయి.
పోస్టుల ముందు ధృవీకరణ అవసరం. తప్పుడు ఆరోపణలు ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్య ఊతమిచ్చేందుకు కుసిద్ధం) కింద శిక్షార్హం. సమాజం ఆలోచించాలి. వైరల్ కంటెంట్ వెనుక మానవ జీవితాలు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌లు ఫాక్ట్–చెక్ పెంచాలి.