Tollywood 200 Crores Gross Films: మన టాలీవుడ్ లో వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. ఇది ఆషామాషీ విషయం కూడా కాదు, గొప్ప థియేట్రికల్ రన్ ఉంటే తప్ప తెలుగు రాష్ట్రాల నుండి ఆ రేంజ్ గ్రాస్ రావడం అసాధ్యం. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఈ చిత్రానికి ముందు ఏయే సినిమాలు ఈ మార్కుని అందుకొని సంచలనం సృష్టించాయి ఒకసారి చూద్దాం. ప్రభాస్ నటించిన బాహుబలి 2 , కల్కి మరియు సలార్ చిత్రాలు తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నాయి.
ప్రస్తుతానికి ఈ క్లబ్ లో ఆయనే టాప్ స్థానం లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’, #RRR చిత్రాలతో రెండవ స్థానం లో ఉన్నాడు. ‘దేవర’ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా గొప్ప లాంగ్ రన్ ని సొంతం చేసుకుంది. సరైన సీజన్ లో రావడం కూడా ఆ చిత్రానికి ప్లస్ అయ్యింది. ఇక మిగిలిన హీరోలందరికీ ఒక్కో సినిమా చొప్పున ఈ ప్రతిష్టాత్మక క్లబ్ లో చోటు దక్కించుకున్నాయి. గత ఏడాది భారీ అంచనాల నడుమ దసరా కానుకగా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ‘దేవర’ చిత్రం లాగానే ఈ సినిమాకు కూడా యావరేజ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టడం గమనార్హం.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన #RRR చిత్రాలు ఈ క్లబ్ లో చోటు సంపాదించుకున్నాయి. టాలీవుడ్ లో 6 మంది స్టార్ హీరోలు ఉంటే, అందులో 5 మంది ఈ క్లబ్ లో భాగం అయ్యారు. ఇక సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి కి ఒక్కటే ఆ స్థానం దక్కింది. అయితే స్టార్ హీరోల్లో మహేష్ బాబు కి ఈ 200 కోట్ల క్లబ్ లో చోటు దక్కకపోవడం గమనార్హం. ఆయన చేసిన సినిమాలన్నీ ఈమధ్య కాలం లో కంటెంట్ పరంగా మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉన్నవే. గుంటూరు కారం కూడా థియేటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ, ఓటీటీ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంటే ఆడియన్స్ ఈ సినిమా కంటెంట్ ని బాగా నచ్చారు. అయినప్పటికీ కూడా ఫ్లాప్ అయ్యిందంటే కచ్చితంగా మహేష్ స్టామినా లో ఎదో తేడా జరిగిందని విశ్లేషకులు అంటున్నారు.